తెలంగాణ

జూన్‌కల్లా కల్వకుర్తి లిఫ్ట్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులన్నీ వచ్చే జూన్ నాటికి పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కల్వకుర్ది ప్రాజెక్టుకు గతంలో విధించిన గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలని ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. జలసౌధలో మంగళవారం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులను మంత్రి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పనుల్లో తీవ్రసమస్యలను గుర్తించి అధిగమించే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ కమిటీలో నీటిపారుదలశాఖ సాంకేతిక సలహాదారు విజయప్రకాశ్, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, చీఫ్ డిజైనింగ్ ఆఫీసర్ రాజశేఖర్ ఉంటారని మంత్రి పేర్కొన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు సకాలంలో పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ఈ నెల 26కల్లా నివేదిక సమర్పించాలని మంత్రి ఆదేశించారు. కమిటీ చేసిన సిఫారసులకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్‌కల్లా 4500 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలను సిద్ధం చేసుకోవాలని మంత్రి సూచించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో టనె్నల్ మూడులో అసంపూర్తిగా మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ప్రధాన కాలువ, లైనింగ్ పనులు, స్ట్రక్చర్ల పనులు కూడా ఏకకాలంలో జరుగాలన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు రాజీవ్ భీమా ప్రాజెక్టు, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి అయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీటి సదుపాయం కలుగుతుందన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 25 టిఎంసిల నీటి కేటాయింపు ఉండగా తెలంగాణ ప్రభుత్వం దానిని 40 టిఎంసిలకు పెంచిందని మంత్రి గుర్తు చేసారు. నీటి కేటాయింపును పెంచడం వల్ల అదనంగా 4.20 లక్షల ఆయకట్టు పెరిగిందని మంత్రి వివరించారు.

చిత్రం..అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు