తెలంగాణ

నేడే సేద్యం వర్సిటీ స్నాతకోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం (కాన్వొకేషన్) బుధవారం నిర్వహిస్తున్నారు. విశ్వవిద్యాలయం ఆవరణలోని ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆడిటోరియంతో పాటు విశ్వవిద్యాలయంలోని ప్రధాన భవనాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. 2014 సెప్టెంబర్ 3 న ఈ యూనివర్సిటీ ఏర్పాటైన తర్వాత స్నాతకోత్సవం జరగడం ఇదే ప్రథమం. 2014-15, 2015-16 సంవత్సరాల్లో పిహెచ్‌డి, పిజి, యూజి కోర్సులు పూర్తయిన విద్యార్థులకు పట్టాలను అందిస్తారు. విశ్వవిద్యాలయం బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు స్నాతకోత్సవం సంబరాల్లో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఉన్నారు. పిజి, పిహెచ్‌డి పూర్తి చేసిన 319 మంది, అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 970 మంది విద్యార్థులకు పట్టాలు అందిస్తున్నారు. 17 మంది విద్యార్థులకు బంగారు పతకాలు ఇస్తున్నారు.