తెలంగాణ

నాలుగు రోజుల వ్యవధిలో రాష్టప్రతి రెండుసార్లు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకతో పాటు శీతాకాల విడిది కోసం రెండు పర్యాయాలు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ హైదరాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు అధికారిక సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి అందింది. నాలుగు రోజుల వ్యవధిలో రెండుసార్లు రాష్టప్రతి పర్యటన ఖరారు కావడంతో ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ మంగళవారం సంబంధిత అధికారులతో చర్చించారు. ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 19న మధ్యాహ్నం 2.55 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి రాష్టప్రతి చేరుకుంటారని సిఎస్ వివరించారు. సాయంత్రం ఎల్‌బి స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ఆ రాత్రికి బొల్లారంలోని రాష్టప్రతి నిలయంలో బస చేస్తారు. ఆ మరుసటి రోజు ఉదయం ట్యాంక్ బండ్‌కు చేరుకుని గౌతమ బుద్ధుని విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు. ఆ తర్వాత ఈ నెల 23న శీతాకాల విడిది కోసం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. నగరంలో ఏర్పాటు చేసిన రాష్టప్రతి పాల్గొనే కార్యక్రమంతో పాటు బస చేయనున్న బొల్లారంలోని రాష్టప్రతి నిలయం వద్ద బందోబస్తు, విద్యుత్, పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మత్తు, స్వాగత తోరణాల ఏర్పాటుపై అధికారులకు సిఎస్ మార్గదర్శకం చేసారు.