తెలంగాణ

హోంగార్డుల వేతన వరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు పెంపు
జనవరి నుంచే అమలు.. ఏటా వెయ్య పెంపు
కోరుకున్న చోట డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు
ట్రాఫిక్ గార్డులకు పోలీసు సమాన అలవెన్స్
పోలీస్ రిక్రూట్‌మెంట్ అన్నింటిలో కోటా పెంపు
మహిళా హోంగార్డులకు 6 నెలల మెటర్నిటీ లీవు
రెగ్యులరైజ్‌కు ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి..
హోంగార్డులతో సమావేశంలో కేసీఆర్ ప్రకటన

హైదరాబాద్, డిసెంబర్ 13: హోంగార్డులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బుధవారం వరాలు ప్రకటించారు. ప్రస్తుతం రూ.12 వేలు ఉన్న వేతనాన్ని రూ.20 వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. పెంచిన వేతనం జనవరి నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అలాగే ప్రతీ ఏడాది రూ.1000 చొప్పున ఇంక్రిమెంట్‌ను కూడా సిఎం ప్రకటించారు. ఇకనుంచి పోలీసులతో సమానంగా హోంగార్డుల కుటుంబాలకు వైద్యం, ఇన్స్యూరెన్స్, మెటర్నిటీ సదుపాయం వర్తిస్తుందన్నారు. పోలీస్‌శాఖలో జరిగే అన్ని నియామకాల్లోనూ హోంగార్డులకు రిజర్వేషన్ల కోటా పెంచుతున్నట్టు ప్రకటించారు. ప్రగతి భవన్‌లో బుధవారం హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డిలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హోంగార్డుల సర్వీసుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు కోర్టులకెళ్లి అడ్డుపడటం వల్ల సాధ్యం కావడం లేదన్నారు. దీంతోపాటు ఇంత వరకు జరిగిన హోంగార్డుల నియామకాల్లో రోస్టర్ పాటించకపోవడం కూడా క్రమబద్ధీకరణకు సాంకేతికంగా అడ్డంకిగా మారిందన్నారు. కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణకు కోర్టు అభ్యంతరం చెప్పడం వల్ల రెగ్యులర్ లెక్చరర్లతో సమానంగా వేతనాలు ఇచ్చామని సీఎం గుర్తు చేసారు. అదేవిధమైన సమస్య హోంగార్డులకూ ఎదురుకావడంతో ప్రస్తుతం ఉన్న వేతనాన్ని రూ.20 వేలకు పెంచుతున్నామన్నారు. దీంతో రాష్టవ్య్రాప్తంగా 18 వేల పైచిలుకు హోంగార్డులకు లబ్ధికలుగనుందన్నారు. వేతనాలు పెంచడం, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు హోంగార్డులు కోరుకున్న చోటా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టిస్తామని సీఎం ప్రకటించారు. హోంగార్డుల కుటుంబ సభ్యులు అందరికీ హెల్త్ ఇన్స్యూరెన్స్ వర్తింప చేస్తామని, పోలీస్ హాస్పిటల్స్‌లో హోంగార్డులకు వైద్య చికిత్సలకు అవకాశం కల్పిస్తామన్నారు. ట్రాఫిక్ విభాగంలో పని చేసే హోంగార్డులకు పోలీసులతో సమానంగా 30 శాతం అదనపు అలవెన్స్ కల్పిస్తామన్నారు. బందోబస్తు డ్యూటీలు చేసేవారికి పోలీస్ కానిస్టేబుళ్లతో సమానంగా డైట్ చార్జీలు ఇస్తామన్నారు. మహిళా హోంగార్డులకు 6 నెలల మెటర్నిటీ సెలవు, పురుష హోంగార్డులకు 15 రోజుల పెటర్నిటీ సెలవు కల్పిస్తామన్నారు.
రిక్రూట్‌మెంట్లలో రిజర్వేషన్లు
టిఎస్‌ఎస్‌పి నియామకాల్లో 10 శాతం కోటాను 25 శాతానికి, ఎఆర్ కానిస్టేబుల్ పోస్టుల్లో 5 శాతం కోటాను 15కు, సివిల్ పోలీస్‌ల నియామకాల్లో 8 శాతం కోటాను 15కు, పిటిసి డ్రైవర్ల నియామకంలో 2 శాతం కోటాను 20కి, పిటిసి మెకానిక్స్ నియామకాల్లో 2 శాతం కోటాను 10కి, ఎస్‌పిఎఫ్ నియామకాల్లో 5 శాతం కోటాను 25కు, అగ్నిమాపక శాఖ నియామకాల్లో 10 శాతం కోటాను 25కు, ఎస్‌ఎఆర్‌సిపిఎల్ నియామకాల్లో 5 శాతం కోటాను 25కు, పోలీస్ కమ్యూనికేషన్స్ నియామకాల్లో 2 శాతం కోటాను 10కి పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.