తెలంగాణ

ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది హై అలెర్ట్ ప్రకటించారు. లక్నోకు చెందిన షోయబ్ అనే యువకుడి ఐసిస్‌తో సంబంధాలున్నాయని, ఢిల్లీ నుంచి జెద్దా వెళ్తున్నాడని, ఎప్పుడైనా..ఎక్కడైనా ఏదో ఓ విమానాన్ని హైజాక్ చేసే యోచనలో ఉన్నట్టు ఓ మహిళ సమాచారం మేరకు నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. బుధవారం ఫోన్ ద్వారా సమాచారమిచ్చిన మహిళ జమ్ము నుంచి మాట్లాడినట్టు సమాచారం. దీంతో నిఘా వర్గాలు ముంబయి, హైదరాబాద్ విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చారు. ఈ మేరకు అధికారుల శంషాబాద్ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీలతోపాటు ప్రయాణీకులను సహితం విచారిస్తున్నారు. శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై పోలీసులను మోహరింపజేశారు. ఆర్టీసీ బస్సులతోపాటు ప్రైవేటు టాక్సీలను కూడా ప్రత్యేక బలగాలతో సోదాలు నిర్వహిస్తున్నారు.