తెలంగాణ

టిఆర్టీపై టిశాట్ కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: టిఆర్టీ పరీక్షలు రాసే అభ్యర్ధులకు టి శాట్ ప్రత్యక్ష ప్రసారాలు ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రసారం చేయనున్నట్టు టి శాట్ సిఇఓ ఆర్ శైలేష్‌రెడ్డి చెప్పారు. బుధవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ప్రత్యక్ష ప్రసారాలు 14వ తేదీ నుండి ప్రసారం అవుతాయని అన్నారు. రోజుకు 10 గంటలు చొప్పున, 80 రోజుల పాటు వెయ్యి గంటల పాటు ప్రసారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. టి శాట్ నెట్‌వర్కు చానళ్లు నిరుద్యోగుల కోసం మరో ప్రత్యేక కార్యక్రమం టిఆర్‌టి ఉద్యోగ గైడ్ పేరుతో రూపొందించినట్టు ఆయన వివరించారు. గతంలో నిర్వహించిన గ్రూప్-2, నీట్, ఐఐటి, పాలిసెట్, గురుకుల , టెట్ వంటి పోటీ పరీక్షలకు అందించిన ప్రసారాలకు విశేష ఆదరణ లభించిందని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రాంతలో ఉన్న పేద, మారుమూల ప్రాంతాల విద్యార్థుల కోసం టి శాట్ ద్వారా కోచింగ్ కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. ఐటి మంత్రి కెటిఆర్ సూచన మేరకు పబ్లిక్ సర్వీసు కమిషన్ నిర్వహించే అన్ని పరీక్షలకు కోచింగ్ ప్రారంభించామని తెలిపారు. 14వ తేదీ తొలి కార్యక్రమంలో ఓరియంటేషన్ ఉంటుందని, దాని వల్ల పరీక్షలు రాసేవారికి ఒక స్పష్టత వస్తుందని చెప్పారు.