తెలంగాణ

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని సస్పెండ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: టిఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ ఆర్ భూపతిరెడ్డి సస్పెన్షన్‌కు రంగం సిద్ధం అయింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఇదివరకే భూపతిరెడ్డిని తీవ్రంగా మందలించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకపోవడంతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా భూపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా తీర్మానం చేసి పార్టీ అధినేత కెసిఆర్‌కు లేఖ రాసారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న భూపతిరెడ్డి అంశపై హైదరాబాద్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో బుధవారం పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసారు. పార్టీ నిజామాబాద్ జిల్లా ఇంచార్జీ, కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తులా ఉమ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు హామీ ఇచ్చారు. ఇలా ఉండగా ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాలకు ముందు జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిని పార్టీ అధినేత కెసిఆర్ తీవ్రంగా మందలించారు.
పార్టీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌పై భూపతిరెడ్డి తప్పుడు కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదని, ఇక ముందు అలాంటి చర్యలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ సందర్భంగా హెచ్చరించారు. అయినప్పటికీ భూపతిరెడ్డిలో మార్పు రావడం లేదని నిజామాబాద్‌కు చెందిన పార్టీ నేతలు తిరిగి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం.