తెలంగాణ

విదేశీయులపై తగ్గిన దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: భారత్‌కు వచ్చే విదేశీయులపై దాడులు తగ్గాయి. ఉన్నత విద్య, వ్యాపారం, ఉద్యోగాల వీసాపై వచ్చే విదేశీయులపై గత రెండేళ్లతో పోలిస్తే, 2016లో విదేశీయులపై దాడులు తగ్గాయని క్రైం రికార్డ్స్ ఆఫ్ బ్యూరో (ఎన్‌ఆర్‌సీబీ)లో వెల్లడైంది. దేశంలోని మొత్తం 29 మెట్రో నగరాల్లో విదేశీయులపై 191 దాడులు 38 కేసుల నమోదుతో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. రాజస్థాన్ 25 కేసులతో రెండోస్థానంలో ఉండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మూడోస్థానంలో ఉన్నాయి. మహారాష్టల్రో 2014లో 59 కేసులు నమోదయ్యాయి. 2015లో 53 కేసులు నమోదు కాగా, 2016లో 38 కేసులు నమోదయ్యాయి. 2014లో రాజస్థాన్‌లో 36 కేసులు నమోదు కాగా, 2015లో 24 కేసులు, 2016లో 25 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లో 2014లో 66 కేసులు నమోదయ్యాయి. 2016లో 33 కేసులు నమోదు కాగా, 2016లో కేవలం 6 కేసులు నమోదయ్యాయి. 2014లో తెలంగాణలో 2 కేసులు, 2015లో ఒక కేసు నమోదు కాగా, 2016లో 4 కేసులు నమోదయ్యాయి.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో 2014లో 5 కేసులు, 2015లో ఒక కేసు నమోదు కాగా, 2016లో 5 కేసులు నమోదయ్యాయి. కర్నాటకలో 2014లో 14 కేసులు, 2015లో 22 కేసులు నమోదయ్యాయి. 2016లో 12 కేసులు నమోదయ్యాయి. 2014లో గోవాలో 73 కేసులు నమోదు కాగా, 2015లో 30, 2016లో 22 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 2014లో 7 కేసులు నమోదు కాగా, 2015లోనూ 7 కేసులు నమోదయ్యాయి. 2016లో 24 కేసులు నమోదుతో దాడులు పెరిగాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరఖండ్, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల్లో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.