తెలంగాణ

పాలమూరు ఎత్తిపోతలకు ముందడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, ఏప్రిల్ 28: గత మూడు దశాబ్దాల కాలం నుండి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ కారణంగా ముందడుగు పడుతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేకంగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి తీరాలని తెలంగాణలోని మూడు జిల్లాలకు కృష్ణా జలాలను అందించాలనే సంకల్పంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ జరగబోతోంది. అందులో భాగంగా ఇదివరకే ముఖ్యమంత్రి హోదాలో కెసిఆర్ దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని భూత్పూర్ మండలం కర్వెన దగ్గర ఎనిమిది నెలల క్రితమే పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా కర్వెన రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఆ రిజర్వాయర్‌కు కురుమూర్తి రాయుడు రిజర్వాయర్‌గా ప్రకటించారు. అయితే ప్రస్తుతం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులకు శ్రీకారం చుట్టేందుకు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేడు జిల్లాలోని కృష్ణానది తీరాన ఈ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే నార్లపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి కావాల్సిన 2619 ఎకరాల భూమికిగాను ఇప్పటికే అధికారులు 2122 ఎకరాలు రైతుల నుండి కొనుగోలు చేశారు. దాదాపు ఆరు నుండి తొమ్మిది టిఎంసిల కెపాసిటీతో నార్లపూర్ రిజర్వాయర్‌ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. శుక్రవారం ఉ. 8 గంటలకు మంత్రి హరీశ్‌రావు హెలికాప్టర్‌లో కొల్లాపూర్‌కు చేరనున్నారు. ఉ. 9 గంటలకు నార్లపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని గోపాల్‌పేట మండలం ఎదుల రిజర్వాయర్ నిర్మాణానికి బయలుదేరతారు. ఉ. 10.15కు ఎదుల రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేస్తారు. ఉ. 10.30కు అక్కడే ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 6.55 టిఎంసిల కెపాసిటీ గల ఎదుల రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణానికి 3276 ఎకరాల భూమి అవసరం ఉండగా ఇప్పటికే అధికారులు 2836 ఎకరాల భూమిని రైతుల నుండి కొనుగోలు చేశారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు శ్రీకారం చుట్టనుండటంతో రైతాంగం ఆశలు నెరవేరే రోజు వచ్చిందని భావిస్తున్నారు.