తెలంగాణ

సన్నాహక కేంద్రాలుగా గ్రంథాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నాహక కేంద్రాలుగా గ్రంథాలయాలను వినియోగిస్తున్నామని రాష్ట్ర గ్రంథాయల పరిషత్ అధ్యక్షుడు, ప్రపంచ తెలుగు మహాసభల కోర్ కమిటీ సభ్యుడు అయిన ఆయాచితం శ్రీధర్ తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రపంచ తెలుగు మహాసభలకోసం గ్రంథాయాలన్నింటినీ సన్నాహక, సమాచార కేంద్రాలుగా ఉపయోగిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 568 శాఖా గ్రంథాలయాలతో సహా మొత్తం వెయ్యివరకు గ్రంథాలయాలు నడస్తున్నాయన్నారు. 2017 నవంబర్ 14 నుండి డిసెంబర్ 14 వరకు మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా తెలుగు మహాసభలతో ముడిపెట్టి వ్యాసరచన, వక్తృత్వ పోటీలతో పాటు పండిత గోష్టులు, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో నేరుగా పాల్గొనక పోయినా, పరోక్షంగా అయినా పాల్గొంటున్నామన్న అభిప్రాయం సాధారణ ప్రజల్లో, యువత, మహిళలు, విద్యార్థులు, రైతులు, వ్యాపారులు తదితరుల్లో కలిగించాలన్నదే తమ ఉద్దేశమని శ్రీధర్ స్పష్టం చేశారు.