తెలంగాణ

పనితీరులో మేటి ద.మ రైల్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: గడచిన ఆరు నెలల్లో అత్యంత ప్రతిభావంతంగా పని చేసి తన సమర్ధతను చాటుకుని దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సిఆర్) జోన్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. వివిధ కేటగిరిల్లో నిర్ధేశిత లక్ష్యాలను అధిగమిస్తూ పని తీరు సమర్ధతను నిరూపించుకున్న రైల్వే జోన్ల పనితీరును సమీక్షించిన రైల్వే బోర్డు ద.మ.రైల్వే ప్రధమ స్ధానంలో నిలిచిందని ప్రకటించింది. రెండో స్ధానంలో ఆగ్నేయ రైల్వే (సౌత్‌ఈస్ట్రన్ రైల్వే) జోన్ నిలవగా, మూడో స్ధానంలో పశ్చిమ రైల్వే (వెస్ట్రన్ రైల్వే) జోన్‌కి దక్కిందని ద.మ.రైల్వే తెలిపింది. బుధవారం ద.మ.రైల్వే ప్రధాన కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అద్భుత పనితీరు కనబర్చిన జోన్ అధికారులు, సిబ్బందిని జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ యాదవ్ అభినందించారు. రైల్వే బోర్డు ప్రతి ఆరు నెలలకోసారి పనితీరుకు సంబంధించి గుర్తించిన 27 రకాల ‘కీ ఫర్‌ఫార్మెన్స్ ఇండికేటర్స్ (కెపిఐ)’ను ప్రామాణికంగా తీసుకుని అత్యంత ప్రతిభ కనబర్చిన రైల్వే జోన్లను ప్రకటించడం సంప్రదాయం. ఇందుకు గాను 2017-18 సంవత్సరానికి రైల్వే బోర్డు సెక్రటరీతో అన్ని జోన్ల జనరల్ మేనేజర్లు నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేందుకు గాను ఇప్పటికే అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకున్నారు. ఈ మేరకు రైల్వే బోర్డు అన్ని జోన్ల పనితీరును విశే్లషించిన అనంతరం ద.మ.రైల్వే అద్భుత ప్రతిభ కనబర్చిందని పేర్కొంటూ ప్రథమ స్ధానంలో ఉందని ధృవీకరించిందని జిఎం యాదవ్ ఆ ప్రకటనలో తెలిపారు. రైల్వేలో ఉన్న 16 జోన్లలో 71.90 శాతం మార్కులు సాధించి ద.మ.రైల్వే ప్రథమ స్ధానంలో ఉండగా, 69 శాతం సాధించి ఆగ్నేయ రైల్వే రెండవ, పశ్చిమ రైల్వే 66.29 శాతం మార్కులు సాధించి మూడో స్ధానంలో ఉన్నట్లు రైల్వే బోర్డు ప్రకటించింది. ద.మ.రైల్వే ఆపరేషన్స్, ఫైనాన్సియల్ సెగ్మెంట్‌లో రూ.7717.49 కోట్లు, ప్యాసింజర్ ట్రాఫిక్ 192.54 మిలియన్లు, సరుకు రవాణా లోడింగ్ 48.34 మిలియన్ టన్నులు, 95 శాతం రైళ్లను సమయానికి నడపడం వంటి విభాగాల్లో అద్భుతంగా పని చేసి ప్రథమ స్ధానంలో నిలిచింది. ఇంకా కొత్త రైల్వే లైన్ల ఏర్పాటు, మనిషి కాపలా లేని లెవెల్ క్రాసింగ్స్ తొలగించడం వంటి వాటిలో ద.మ.రైల్వే మిగిలిన జోన్ల కన్నా ముందుంది. అలాగే ఉన్న లైన్‌ను తొలగించి కొత్త లైను వేయడం, డీజిల్ ఇంజిన్ల ద్వారా వినియోగం 480 కి.మీ, ఎలక్ట్రిక్ లోకో వినియోగం 429 కి.మీ గా నమోదు కావడం కూడా పరిగణనలోకి తీసుకుంది.
హైదరాబాద్-జైపూర్-హైదరాబాద్ మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. జనవరి 5, 12, 19, 26, ఫిబ్రవరి 2, 9, 16, 23 తేదీల్లో హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైలు బయలు దేరుతుంది. తిరుగు ప్రయాణంలో జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో జైపూర్ నుంచి బయలుదేరుతుందని తెలిపింది. అలాగే సికింద్రాబాద్-కాకినాడటౌన్-సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలిపింది. కాకినాడ టౌన్ నుంచి 22న ప్రత్యేక రైలు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ నుంచి 23న బయలుదేరుతుందని రైల్వే వెల్లడించింది