తెలంగాణ

పేదరికం లేని సమాజమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామాలు, పట్టణాల మధ్య అంతరం తగ్గాలి
సాధనకు వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేయాలి
స్నాతకోత్సవంలో గవర్నర్ నరసింహన్ పిలుపు

హైదరాబాద్/ రాజేంద్రనగర్, డిసెంబర్ 13: పేదరికం లేని తెలంగాణ సమాజం రావాలన్నది తన కల అని, అందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయ చాన్స్‌లర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలు, పట్టణాల మధ్య అంతరం తగ్గాలని ఆకాంక్షించారు.
సమాజంలో అంతర్భాగమై గ్రామాల అభివృద్ధి కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. గ్రామాలలో ప్రజల అభ్యున్నతి కోసం, వారి జీవన ప్రమాణాల పెంపు కోసం విశ్వవిద్యాలయాలు కృషి చేయాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం తనకు అత్యంత సంతృప్తినిచ్చిందన్నారు. వ్యవసాయం, ఉద్యాన, విభాగాలు సమన్వయంతో కలిసి పని చేయడంపై ముఖ్యమంత్రితో తాను చర్చిస్తానన్నారు. పంటకాలనీల ఏర్పాటుకు సంబంధించిన విధానపత్రం రూపకల్పనలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిందన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులచే గ్రామాల దత్తత తీసుకొని అక్కడ విద్య, వైద్యం, ఆరోగ్యం సురక్షిత తాగునీరు కల్పించే అంశంపై ప్రోత్సహించాలని సూచించారు. ప్రయోగశాలలో జరుగుతున్న పరిశోధన ఫలాలు రైతుల పొలాలకు అందించడం ఎంతో అవసరమన్నారు. విద్యార్థులకు తరగతి బోధన కన్నా, ప్రాక్టికల్ నాలెడ్జ్‌పై శిక్షణ కల్పించాలని అన్నారు. విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందిన విద్యార్థులు, సమాజం అభివృద్ధి కోసం ఉపయోగపడాలని, అలా జరగనప్పుడు వాటికి ఫలితం ఉండదని ఆయన విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.