తెలంగాణ

రహదారులు అభివృద్ధికి చిహ్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మల్, డిసెంబర్ 13: రహదారులు రాష్ట్ర ఆభివృద్ధికి చిహ్నాలని, అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను వెచ్చించి రహదారు ల నిర్మాణం చేపడుతోందని రాష్ట్ర గృహ నిర్మా ణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని రత్నాపూర్ కాండ్లి గ్రామంలో రూ. 91 లక్షల నిధులతో చేపట్టనున్న తారురోడ్డు పనులకు మంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ మంచి రహదారులు ఉంటేనే గ్రామాలు ఆభివృద్ధి పథంలో దుసుకెళ్తాయనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. వచ్చే సంవత్సరం జనవరి ఒకటి నుండి వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందించనున్నామని అన్నారు.
అన్నివర్గాల ప్రజ లు, కులవృత్తులను ప్రోత్సహించి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. యాదవు లు, గొల్లకుర్మలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెలను, మత్స్యకారులను ఆర్థికంగా ఆదుకునేందుకు రాష్ట్రంలోని కుంటలు, చెరువుల్లో 70 కోట్ల చేప పిల్లలను విడుదల చేశామని అన్నారు. ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉండేందకు మిషన్ భగీరథ పథకం ద్వారా వచ్చే జనవరి నుండి స్వచ్ఛమైన తాగు నీటిని అందించనున్నామని అన్నారు.
రత్నాపూర్ కాండ్లి నుండి ముటాపూర్ గ్రామానికి రూ. 60 లక్షల నిధులతో రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కాండ్లి వద్ద సబ్‌సెంటర్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని అన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో వ్యక్తి మరుగుదొడ్లు నిర్మించుకున్న 134 మంది లబ్ధిదారులకు ఒకొక్కరికి రూ.12 వేల చొప్పున చెక్కులను అం దించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, ఐటీడీఏ ఈఈ రమేష్, పీఏసీఎస్ చైర్మన్ జివన్ రెడ్డి, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ సభ్యుడు మహేష్‌రెడ్డి, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు నరేష్, తహశీల్దార్ శంకర్, ఎంపీడీవో గజ్జారాం, నాయకులు ముత్యం రెడ్డి, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.