తెలంగాణ

ఆరేళ్ళ బాలికపై అత్యాచారం... ఆపై హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, డిసెంబర్ 13: అభం శుభం తెలియని ఆరేళ్ళ చిన్నారిపై అత్యాచారం చేసి విషయం బయటికి పొక్కకుండా ఉండేందుకు హత్య చేసిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వనపర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకా రం...వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో బురాన్ బాబా అనే మాంత్రికుడు నిర్మిస్తున్న ఇంట్లో కొల్లాపూర్ మండలానికి చెందిన తాపీ పనిచేస్తున్న రామకృష్ణ, మరో ఇద్దరు మద్యం సేవించి అభం శుభం తెలియని ఆరు సంవత్సరాల చిన్నారి నాగేశ్వరిని చాక్లెట్ ఇస్తామని భవనం మొదటి అంతస్తులోకి తీసుకొని వెళ్ళి ఈనెల 10వ తేదీన హత్య చేశారు. అయతే, చిన్నారి హత్యకు ముందు అత్యాచారం చేశారా లేదా అన్న విషయం పోస్టుమార్టం రిపోర్టు అనంతరం తెలుస్తుంది. చిన్నారి తండ్రి ఆంజనేయు లు అప్పుడుప్పుడు నిందితులతో పాటు మద్యం విందులో పాల్గొనేవారు. గత కొన్ని రోజులుగా ఇంటి నిర్మాణం కోసం అక్కడే ఉంటున్న రామకృష్ణ, మరో ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో హత్య చేసి ఇంటికి నిర్మించిన సజ్జపై చిన్నారిని చాపలో చుట్టి పడేశారు. ఈనెల 10వ తేదీన ఆదివారం తమ కుమార్తె కనిపించడం లేదని తల్లిదండ్రులు కల్పన, ఆంజనేయులు వనపర్తి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్రామస్థులకు అనుమానం కలిగి నిర్మాణం జరుగుతున్న ఇంటిలో మంగళవారం రాత్రి వెతకగా చిన్నారి శవం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని వనపర్తి జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించి, నిందితుల కోసం గాలింపు చేపట్టా రు. కాగా, గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఇదిలా ఉండగా నిందితులు రామకృష్ణతో పాటు మరో ఇద్దరు పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలుస్తోంది.
చిన్నారిని బలిచ్చారని బురాన్‌పై గ్రామస్థుల ఆరోపణ
వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో హత్య కు గురైన చిన్నారి నాగేశ్వరిని (6) మాంత్రికుడైన బురాన్ బాబా తన ఇంటికి బలిచ్చారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. నిత్యం క్షుద్ర పూజలు చేస్తూ అన్ని రోగాలు నయం చేస్తానని చెబుతూ కోట్లకు పడగలెత్తిన బురాన్ బాబా తన ఇంటి నిర్మాణానికి చిన్నారి నాగేశ్వరిని బలిచ్చి ఇంట్లోనే శవాన్ని దాచారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఆరేళ్ళ చిన్నారిని అత్యాచారం చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని గ్రామస్థులు వేల మంది గుమిగూడి బురాన్‌బాబాను వెతకడం ప్రారంభించడంతో గమనించిన పోలీసులు బురాన్‌బాబాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికి గ్రామస్థులు ఆగ్రహావేశాలతో రోడ్డుపై బైఠాయించడంతో వనపర్తి సీఐ వెంకటేశ్వర్లు, కొత్తకోట సీఐ సోమ్‌నారాయణసింగ్, జిల్లాలోని ఎస్‌ఐలను పిలిపించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు.