తెలంగాణ

తెలంగాణ తల్లిని మరిచిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్ర రచయిత నరసింహమూర్తిని ఆహ్వానించి అందెశ్రీని ఆహ్వానించ లేదు
విమర్శించిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ తల్లిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరిచిపోయారని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్యే ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలుగు తల్లి ఎవరు అని ప్రశ్నించిన కెసిఆర్ ఇప్పుడు తెలంగాణ తల్లిని తెలుగు మహా సభల్లో స్థానం ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. బుధవారం చేవెళళ, రాజేంద్రనగర్ నియోజకవర్గాలకు చెందిన టిడిపి, టిఆర్‌ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్‌రెడ్డి, రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన కళాకారులకు తెలుగు మహా సభల్లో స్థానం లేకుండా చేయడం దారుణమని విమర్శించారు. ఆంధ్ర రచయిత నరసింహామూర్తిని ఆహ్వానించిన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలంగాణకు చెందిన అందెశ్రీ, విమలక్క గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చేవెళ్ళ సెంటిమెంట్ ఉంది కాబట్టి అక్కడ పార్టీకి విజయం చేకూర్చి, జెండా ఎగుర వేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.