తెలంగాణ

ఘన వ్యర్థాలపై 15న అంతర్జాతీయ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: ఘన వ్యర్థపదార్ధాల నిర్వహణకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి సమావేశం ఈ నెల 15న హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి. ఏడవ ఐకాన్ ఎస్‌డబ్ల్యూఎం 2017 పేరుతో ఘన వ్యర్ధ పదార్ధాల వినియోగంపై హైదరాబాద్‌లోని పిజెటిఎస్‌ఏ యూనివర్శిటీలో ఈ నెల 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు అంతర్జాతీయ సమావేశం జరుగుతుందని తెలిపింది. ఘన వ్యర్ధాలను తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, రీ సైకిల్ చేయడం వంటి మూడు లక్ష్యాలతో ఈ సమావేశం దిశా నిర్ధేశం చేసేందుకు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. వ్యర్ధాలను సేకరించడం, వాటిని నాశనం చేయడం వంటి వాటిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మున్సిపల్ చెత్త, పారిశ్రామిక వ్యర్ధాలు, ఇతర బయో వ్యర్ధాలు వంటి వాటిని విడివిడిగా తరలించి వాటిని పర్యావరణం కలుషితం కాకుండా తొలగించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈ సమావేశం నిర్వహించి అనేక అంశాలకు పరిష్కారం కనుగొనేందుకు కృషి జరుగుతోంది.