తెలంగాణ

హోంగార్డుల వేతనాల పెంపు పట్ల హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 13: హోంగార్డులకు వేతనం పెంచడంతోపాటు వారి సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు ప్రకటించడం పట్ల పోలీస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మానవతాదృక్పథంతో సివిల్ కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డుల సంక్షేమాన్ని కాంక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ శాఖలో అతితక్కువ జీతాలతో పనిచేస్తున్న హోంగార్డుల ఇబ్బందులను అర్ధం చేసుకుని సీఎం చారిత్రక నిర్ణయాలు తీసుకోవడం ముదావహమన్నారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మొదటి నంచి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఇదే క్రమంలో హోంగార్డుల అపరిష్కృత సమస్యలు పరిష్కరించారన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో హోంగార్డులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని, ద్విగుణీకృత ఉత్సాహంతో విధులు నిర్వర్తిస్తారని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు.