తెలంగాణ

త్వరలో పాడిగేదెల పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: రాష్ట్రంలో త్వరలో 50 శాతం సబ్సిడీపై 2.18 లక్షల పాడిగేదెలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలంగాణ పశు సంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేశంలోనే గొల్ల, కురుమలు అత్యంత ధనికులుగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమంత్రి కెసిఆర్ ఆశయమని అన్నారు.
దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఉన్న గొల్ల కురుమలకు కోటి 50 లక్షల గొర్రెలను పంపిణీ చేయాలని లక్ష్యం కాగా, 4 నెలల కాలంలో 30 లక్షల గొర్రెలను గొల్ల, కురుమలకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ నెల 29న బుద్వేల్‌లో గొల్ల, కురుమల సంక్షేమ భవనాల నిర్మాణానికి సిఎం కెసిఆర్ భూమి పూజ చేస్తారని తెలిపారు. గొల్ల, కురుమల సంక్షేమ భవనాల నిర్మాణానికి వేర్వేరుగా ఐదెకరాల చొప్పున మొత్తం 10 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు గాను మార్చిలో 10 లక్షల మంది గొల్ల, కురుమలతో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.