తెలంగాణ

ఆశా వర్కర్ల జీతాలు జనవరినుంచి ఖాతాలో జమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: రాష్ట్రంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న వేలాది మంది ఆశా వర్కర్లకు ప్రభుత్వం పెంచిన ఆరు వేల రూపాయల వేతనాన్ని వచ్చే నెల నుంచి నేరుగా వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ప్రకటించారు. ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖ డైరక్టరేట్ ద్వారా వేతనాలు అందేవని, వచ్చే నెల నుంచి నేరుగా వారికి అందుతాయని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయని, వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. డిహెచ్‌ఎంఎస్ కార్యాలయంలో గురువారం జరిగిన తెలంగాణ వైద్య ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం 3వ రాష్ట్ర మహాసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యూనియన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంతో పాటు విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశాఖలో సిబ్బంది పదోన్నతులు చేపట్టారని తెలిపారు.