తెలంగాణ

2019 ఎన్నికల్లో మాదే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోని 31 రిజర్వుడు సీట్లలో కాంగ్రెస్ పెద్ద మెజార్టీతో గెలిచే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఇక్కడ గాంధీభవన్‌లోని ప్రకాశం హాలులో రిజర్వుడు సీట్లలో నాయకత్వం అభివృద్ధి అంశంపై జరిగిన సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014లో 27 సీట్లలో పోటీచేస్తే కాంగ్రెస్ పార్టీ ఆరు సీట్లలో గెలిచిందన్నారు. 19 సీట్లలో కాంగ్రెస్ నాలుగు సీట్లు గెలిచిందన్నారు. 12 ఎస్టీ సీట్లలో రెండు సీట్లలో కాంగ్రెస్ నెగ్గిందన్నారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ మధ్య ఓట్ల తేడా 9.72 శాతం ఉందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలను నమ్మవద్దని ఆయన దళితులు, గిరిజనులను కోరారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాల సముద్ధరణకు కృషి చేసిందన్నారు. ఈ నెల 31వ తేదీ నాటికి మండల స్ధాయి కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామన్నారు. అనంతరం బూత్ స్థాయి కమిటీలపై దృష్టిని సారిస్తామన్నారు. దశలవారీగా రాష్ట్రంలో119 సీట్లలో పార్టీ విస్తరణ, అభివృద్ధితో కార్యకర్తల్లో నూతనోత్తేజం పెంపొందిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో 50 వేల వాట్సప్ గ్రూపులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టిఆర్‌ఎస్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లి ఎండగట్టేందుకు నాయకులు నగరాన్ని వీడి జనంలోకి వెళ్లాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు కెసిఆర్ పనితీరుపట్ల అసహనంగా ఉన్నారన్నారు. సోనియాగాంధీ వల్లనే తెలంగాణ సాధ్యమైందన్నారు. బంగారు తెలంగాణ పేరిట ప్రజలను కెసిఆర్ మోసం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎఐసిసి ఎస్‌సి వినాగం చైర్మన్ కె రాజు, టిపిసిసి వర్కింగ్ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.