తెలంగాణ

పెట్రోల్, స్టాంప్స్ అప్పుడే జీఎస్టీ పరిధిలోకి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: జీఎస్టీ పరిధిలోకి అప్పుడే పెట్రోలియం ఉత్పత్తులు, స్టాంప్స్-రిజిస్ట్రేషన్లను తీసుకురావద్దని జీఎస్టీ ఎంపవర్ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం సూచించింది. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అష్ముక్ అధియా అధ్యక్షతన జరిగిన జీఎస్టీ ఎంపవర్ కమిటీ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హాజరయ్యారు. జీఎస్టీ అమలు వలన ఎదురవుతున్న సమస్యలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించారు. అలాగే జీఎస్టీ పరిధిలోని వివిధ వస్తువులకు సంబంధించిన స్లాబ్ విధానం, కొత్తగా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్న వస్తువులపై కూడ ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం మంత్రి ఈటల రాజేందర్ విలేఖరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతున్నా దీనిపై పూర్తిస్థాయిలో స్పష్టత రాలేదని వెల్లడించారు. గతంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అమలులో ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే, జీఎస్టీ అమలు వలన అంతస్థాయిలో రాష్ట్రాలకు ఆదాయం రావడం లేదని పేర్కొన్నారు. దేశంలోనే 21.9 శాతం వృద్ధిరేటులో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రం, ప్రస్తుతం జీఎస్టీ అమలులోకి వచ్చిన అనంతరం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోందని చెప్పారు. రాష్ట్రాల హక్కులు, స్యయం నిర్ణయాలపై జీఎస్టీ అమలు వలన ఏమాత్రం ప్రభావం చూపకుండా జీఎస్టీ అమలు ఉండాలన్నదే తెలంగాణ రాష్ట్రం కోరుకుంటుందని ఈ సమావేశంలో వెల్లడించినట్టు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రాలపై భారం పడకుండా చూడాలని ఈ సమావేశంలో కోరినట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.