తెలంగాణ

సామాన్యుడి వౌలిక సమస్యలకు ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: సామాన్యుడి వౌలిక సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సివిల్ సర్వీసెస్ ట్రైనీలకు ఐటీశాఖ మంత్రి కీ తారకరామారావు పిలుపునిచ్చారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గురువారం సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన ట్రైనీలను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. సామాన్య ప్రజలకు సంబంధించిన విద్యుత్, మంచినీరు, మరుగు దొడ్డి తదితర వౌలిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో పాలకులు, అధికార యంత్రాంగం సత్వర నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. పాలకులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాలానుగుణంగా మారుతున్న పరిస్థితుల వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. నాయకుడి కేంద్రంగా పని చేయడం వల్ల ప్రయోజనం లేదని, సమిష్టి భాగస్వామ్యం వల్లనే అభివృద్ధిని సాధించగలమని మంత్రి కెటిఆర్ అన్నారు. డివోపిటి కార్యదర్శి అజయ్ మిట్టల్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బిపి ఆచార్య పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ట్రైనీ ఐఏఎస్‌లకు మార్గనిర్దేశం చేశారు.