తెలంగాణ

ఫీజులపై తల్లిదండ్రులతో సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: పెంచిన ఫీజులను చెల్లించేది లేదని సిబిఐటి యాజమాన్యానికి తల్లిదండ్రులు చాలా స్పష్టంగా చెప్పారు. సిబిఐటి అర్థాంతరంగా పెంచిన ఫీజులను చెల్లించాలని కోరడంతో పాటు తల్లిదండ్రులను నచ్చచెప్పేందుకు ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఫీజు 86,500 రూపాయిలను ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివిధ శాఖాధిపతులు వివరించే ప్రయత్నం చేశారు. మెకానికల్ విభాగంలో జరిగిన సమావేశంలో ప్రిన్సిపాల్ రవీందర్‌రెడ్డి పాల్గొని ఫీజుల పెంపుదల అవసరాన్ని వివరించబోయారు. దాంతో సమావేశంలో పాల్గొన్న తల్లిదండ్రులు మూకుమ్మడిగా లేచి పోవడంతో పాటు సంవత్సరం మధ్యలో ఫీజులు పెంచడం అన్యాయమని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లిదండ్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగాటి నారాయణ, కార్యదర్శి పగడాల లక్ష్మయ్య మాట్లాడుతూ పెంచిన ఫీజు చెల్లించాలనడం సరికాదని, క్లాసులకు సెలవులు ప్రకటించిన యాజమాన్యం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలరని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు శంకర్, రమేష్, లచిరామ్, తేజశ్రీ కృష్ణ మాట్లాడుతూ కోర్టు ద్వారా ఆర్డర్ పేరు చెప్పి అడ్డదారిలో ఫీజులు పెంచడం సరికాదని అన్నారు. బి కేటగిరు సీట్ల విద్యార్థులపై అధిక భారం పడుతుందని వారు చెదప్పారు.