తెలంగాణ

‘విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేదు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం ఉండదని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా అన్నారు. ప్రభుత్వం జనవరి 1 నుంచి నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో మార్చి నెల నుంచి విద్యుత్ వినియోగం పెరిగి సరఫరాకు డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. ఆ సమయంలో నిరంతర సరఫరాకు ఇబ్బంది ఏర్పడే అవకాశం లేకుండా అదనంగా ఉత్పత్తి అయ్యే 2500 నుంచి 3500 మెగావాట్ల విద్యుత్ రానున్న రెండు నెలల్లో గ్రిడ్‌కు కలుస్తుందని చెప్పారు. గురువారం నాడిక్కడ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా) తెలంగాణ రాష్ట్ర శాఖ, తెలంగాణ రాష్ట్ర రెనెవబుల్ ఎనర్జీ డెవలెప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహించిన జాతీయ ఇంధన వినియోగ వారోత్సవాల ప్రారంభ సభలో అజయ్ మిశ్రా పాల్గొని ప్రసంగించారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఇప్పటికే ట్రయల్ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.