తెలంగాణ

సైబర్ విధానంపై పరిశీలన చేసి నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో కూడిన సైబర్ సెక్యూరిటీ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయించిన నేపధ్యంలో ఇప్పుడు ఉన్న సైబర్ సెక్యూరిటీ విధానంపై లోతైన అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఇజ్రాయిల్ దేశాన్ని ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కోరారు. ఇజ్రాయిల్‌లోని నేషనల్ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఏజెన్సీ అద్భుతమైన మూడంచెల సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రగతి సాధించిందని తెలిపారు. గురువారం నాడిక్కడ కెన్స్ ఎగ్జిబిషన్స్ సంస్థ నిర్వహణలో రెండు రోజు పాటు జరిగే అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సమావేశంలో పాల్గొన్న జయేష్ రంజన్ మాట్లాడుతూ డిసెంబర్‌లోగా హైదరాబాద్‌లో ప్రభుత్వ సెక్యూరిటీ ఆపరేషన్స్ సెంటర్ (ఎస్‌ఓసి)ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ఎస్‌ఓసిలో మొత్తం రాష్ట్ర డేటా అంతా ఉంటుందని, ప్రభుత్వ వౌళిక అంశాలకు సంబంధించిన కీలక అంశాలన్నీ దీనిలో ఉంటాయని వివరించారు. ఇజ్రాయిల్‌లో ఉన్న మూడు దశల సైబర్ సెక్యూరిటీ రోబస్ట్ వ్యవస్థ మాదిరిగా పటిష్టమైన సెక్యూరిటీ వ్యవస్థ తెలంగాణలోనూ అవసరమని తెలిపారు.