తెలంగాణ

అజ్ఞాతంలోకి వనిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: హాస్య నటుడు విజయ్‌సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్య వనిత రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కుటుంబ తగాదాలపై పలు ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విజయ్‌సాయి ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో క్లారిటీగా లేకపోవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. విజయ్ ఇంటికి నలుగురితో వచ్చి వనిత రెడ్డి కారు తీసుకువెళ్లింది ఒక కేసు కాగా..విజయ్ ఆత్మహత్యకు కారణమంటూ వనిత రెడ్డిపై మరో కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లోనూ వనిత రెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ ఆత్మహత్య చేసుకోక ముందు తన భార్య వనితతో ఫోన్లో మాట్లాడిన ఆడియో సంభాషణ బయటకొచ్చింది. అందులో విజయ్ తన భార్య వనితను చివరి కోరికను కోరినట్టు స్పష్టంగా ఉంది. అంటే..వనితతో ఈ ఫోన్ సంభాషణ సమయంలోనే విజయ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజులపాటు తనతో సంతోషంగా గడపాలన్నది చివరి కోరిక అంటూ విజయ్ ఫోన్‌లో వనితను అభ్యర్థించినట్టు తెలుస్తోంది. విజయ్‌సాయి ఆత్మహత్య కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయకపోవడంపై అతని తండ్రి సుబ్బారావు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెల్పీ వీడియో ఆధారంగా, ఇప్పటి వరకు వనిత, న్యాయవాది శ్రీనివాస్, వ్యాపారవేత్త శశిధర్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ఆయన ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాతూ, తన కొడుకు ఆత్మహత్యకు ఆ ముగ్గురే కారకులన్నారు. తన కొడుకుతో వేరుగా ఉంటున్న వనితకు నగలు, కారు తీసుకెళ్లమని ఏ కోర్టు కూడా చెప్పలేదని, అయినప్పటికీ వనిత తన కొడుకును బెదిరించి కారు తీసుకెళ్లిందని సుబ్బారావు తెలిపారు. ఆమె వెనుక ఉన్న వ్యక్తులు కొద్ది రోజులుగా విజయ్‌ను వేధిస్తున్నారని, మనస్థాపానికి చెందిన విజయ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని సుబ్బారావు స్పష్టం చేశారు.