తెలంగాణ

మహాసభలకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: హైదరాబాద్‌లో ఓ వైపు ప్రపంచ మహాసభలు, మరో వైపు భద్రాద్రి,కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రపంచ తెలుగు మహాసభలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటులో నిమగ్నం కాగా, గురువారం తెలంగాణలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా హైదరాబాద్‌లో నిరసన ప్రదర్శన, ట్యాంక్‌బండ్‌పై గల మహాకవి శ్రీశ్రీ విగ్రహం వద్ద విప్లవ రచయితల సంఘం, పౌరహక్కుల సంఘం నేతల భేటీ కానుండగా పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. అయితే ఎన్‌కౌంటర్‌కు నిరసనగా విరసం, పౌరహక్కుల సంఘాలు నిర్వహించతలపెట్టిన ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు చెబుతుండగా, విరసం నేత వరవరరావు నేతృత్వంలో ఎన్‌కౌంటర్‌కు నిరసనగా నిరసన కార్యక్రమం జరిగి తీరుతుందని ప్రకటించిన నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు మహాసభల నేపథ్యంలో శాంతిభద్రతల దృష్ట్యా ట్యాంక్‌బండ్ పైకి ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా విరసం, పౌరహక్కుల నేతలను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈనెల 19వరకు జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని నగర పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. మహాసభల సందర్భంగా కమిషనర్ గురువారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా ఎల్‌బి స్టేడియం ప్రధాన వేదిక, ప్రతినిధుల గ్యాలరీని పరిశీలించారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాతూ, తెలుగు మహాసభల్లో రోజుకు 30వేల మంది పాల్గొంటారని, ప్రతిరోజూ ఐదువేల మంది ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధుల వాహనాల కోసం 32 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. నిజాం కళాశాలలో ప్రత్యేకాహ్వానితులు, విఐపీలకు చెందిన పార్కింగ్ ఉంటుందని తెలిపారు. ఈనెల 18న ఎల్‌బి స్టేడియంలో సినీ విభావరి సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశామన్నారు. ఎల్‌బి స్టేడియంలో 12వందల మంది పోలీసులు, వంద సీసీ కెమెరాలతో నిఘా పెట్టామని, అదేవిధంగా రవీంద్రభారతి, నిజాం కళాశాల, ఎల్‌బి స్టేడియం పరిసరాల్లో దాదాపు 300 సీసీ కెమెరాలను పోలీస్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేసినట్టు కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లిలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై గల మహాకవి శ్రీశ్రీ విగ్రహం వద్ద విరసం, పౌరసంఘాల నేతలు నిరసన తెలుపనున్నట్టు విరసం నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తరువాత ఇదే తొలి భారీ ఎన్‌కౌంటర్ అని, ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని విరసం నేత వరవరరావు ఆరోపించారు. ప్రజాసంఘాల నాయకులను పట్టుకుని కాల్చి చంపి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరిస్తున్నారని వరవరరావు ఆరోపించారు.
చిత్రం..శుక్రవారంనుంచి మొదలు కానున్న ప్రపంచ తెలుగు మహాసభల వేదిక అయన ఎల్‌బీ స్టేడియంలో గురువారం ఏర్పాట్లను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం కడియం, కమిటీ సభ్యులు.