తెలంగాణ

ప్రాంతానికో నినాదమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఏప్రిల్ 29: కాంగ్రెస్ వ్యతిరేక విధానాల వల్ల ఏర్పడిన తెలుగుదేశం పార్టీ పాలేరు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌తో పొత్తు కలవటంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గ టిఆర్‌ఎస్ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు నామినేషన్ సందర్భంగా ఖమ్మంలో విలేఖరులతో మాట్లాడుతూ అనైతిక పొత్తులతో పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు పాలేరుకు పెద్ద పాలేరుగా పని చేస్తానని భరోసానిస్తున్నారని, ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే టిఆర్‌ఎస్ గెలుపుకు దోహదపడతాయన్నారు.