తెలంగాణ

నియోజకవర్గాలకు వడపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు వీలుగా చాలా ముందుగానే ఎన్నికల వ్యూహాన్ని రచిస్తోంది. వివిధ రాజకీయ పార్టీలతో పొత్తు ఉంటే పరిస్థితి ఏమిటో, పొత్తు లేకుంటే పరిస్థితి ఏమిటనే దానిపై ఇప్పటికే విస్తృతంగా చర్చలు జరిపిన బిజెపి తాజాగా మరో మూడు రోజుల పాటు మేథోమధనం నిర్వహించనుంది. నియోజకవర్గాల వారి అభ్యర్ధుల వడపోత మొదలైంది. ప్రతి నియోజకవర్గానికి కనీసం ఐదారుగురు అభ్యర్ధులను గుర్తించడం, వారిలో కీలక వ్యక్తులను సైతం గుర్తించి వారికి నియోజకవర్గంలో కార్యకలాపాల బాధ్యతలను అప్పగించడానికి బిజెపి సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే 19 వ తేదీ నుండి మూడు రోజుల పాటు ముఖ్య నేతలతో అత్యంత కీలక సమావేశాలను నిర్వహిస్తున్నట్టు , అసెంబ్లీ నియోజకవర్గాల వారీ పార్టీ పరిస్థితులు, తాజా పరిస్థితులపై సమాలోచనలు చేసి, 2019 నాటికి బిజెపి అధికారంలోకి వచ్చేలా వ్యూహాత్మకంగా ముందుకు వెళతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ తెలిపారు. బిజెపి కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదుపరి దృష్టి ఇక తెలంగాణ పైనే ఉంటుందని, తెలంగాణలో బిజెపిని బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ సూచిత ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై కూడా ఉంటుందని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ డైరెక్షన్, జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా నేతృత్వంలో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను గెలవడానికి ప్రత్యేక ఇన్‌చార్జిలుగా బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి రాం మాధవ్, బీహార్ ఆరోగ్యమంత్రి మంగల్ పాండే, కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్, బండారు దత్తాత్రేయ ఉన్నారని, పార్లమెంటు వారి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మోదీ ప్రభుత్వ పనితీరు, పార్టీసిద్ధాంత బలం దేశంలో ఎదక్కడ ఎన్నికలు జరిగినా, బిజెపికి విజయాన్ని కట్టబెడుతున్నాయని అన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కులం, మతం అంశాలను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకువచ్చినా, బిజెపి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే బిజెపికి గెలుపు బాటులు వేస్తున్నాయని లక్ష్మణ్ అన్నారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బిసి, బలహీన వర్గాల ప్రజలకు గత ప్రభుత్వాలు ఎలాంటి ప్రయోజనాలను చేకూర్చకుండా కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయని ఆరోపించారు.