తెలంగాణ

బయోమెట్రిక్, జియో ట్యాగింగ్ యోచన ఉపసంహరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్, జియో ట్యాగింగ్ యోచనను ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్‌వాడీ వర్కర్స్ (టీచర్స్), హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం పద్మ, పి జయలక్ష్మి డిమాండ్ చేశారు. ప్రభుత్వం అంగన్‌వాడీల ఉద్యోగ భద్రతకు నష్టం కలిగించే జివో నెం 14, పింఛన్ లేకుండానే అంగన్‌వాడీలను ఇంటికి పంపాలని తెలియజేస్తూ జిఓ నెం. 19ని జారీ చేసిందని వారు ఆరోపించారు. జిల్లాల్లో అధికారులు అంగన్‌వాడీ కేంద్రాల్లో జియో టాకింగ్ ఏర్పాటు కోసం ఫోటోలు తీస్తున్నారని, ఈ పరిణామాలు ఐసిడీఎస్, అంగన్‌వాడీల పట్ల ఏ విధంగా ఉంటాయోనని రాష్టవ్య్రాప్తంగా అంగన్‌వాడీలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఐసీడీఎస్‌లో సుమారు 70వల మంది అంగన్‌వాడీలు పనిచేస్తున్నారని, వీరంతా మహిళలు కాగా అందరూ మహిళలు ఉన్న స్ర్తి,శిశు సంక్షేమశాఖకు మహిళలు కాకుండా పురుషలు మంత్రులుగా ఉండటం శోచనీయమన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఫిర్యాదుల బాక్స్‌లు పెట్టడం అంటే..ఉద్యోగులను పులి నోట్లో పెట్టడమేనన్నారు. ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు ఐసీడీఎస్ వ్యవస్థతో పాటు అంగన్‌వాడలకు తీవ్రమైన కష్టాలు కలుగజేస్తాయన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్, జియోటాకింగ్ ఏర్పాటును ఆపాలని వారు డిమాండ్ చేశారు.