తెలంగాణ

తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, కల్వకుంట్ల రాజ్యాంగం అమలులో ఉందని టి.టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు.
విపక్షాలకు చెందిన నేతలను యుద్ధప్రాదికన టిఆర్‌ఎస్ చేర్చుకుంటున్నదని ఆయన తెలిపారు. ప్రలోభాలకు లొంగని వారిని మనో వేదనకు గురిచేస్తున్నారని ఆయన విమర్శించారు. స్థానిక ప్రజా ప్రతినిధులపై కూడా వత్తిడి తీసుకొస్తూ వారిని బెదిరిస్తూ టిఆర్‌ఎస్‌లో చేరాలని, లేదంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని ఆయన తెలిపారు. టిఆర్‌ఎస్ క్యాంపు రాజకీయాలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఆధారాలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు రావుల చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో టిఆర్‌ఎస్‌కు 300 ఓట్లు ఉంటే రెండు స్థానాలు గెలుపొందే ప్రయత్నం చేస్తున్నదని ఆయన తెలిపారు. గెలుపే లక్ష్యంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని ఆయన విమర్శించారు.
నల్లగొండ కమిటీ నిలుపుదల
ఇలాఉండగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లా టిడిపి అధ్యక్షుడిని, ఇటీవల ప్రకటించిన జిల్లా కమిటీని నిలుపుదల చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ వివివి చౌదరి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఆటోరిక్షా డ్రైవర్లకు విజ్ఞప్తి చేసిన మంత్రి కెటిఆర్

హైదరాబాద్, డిసెంబర్ 20: రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ను బలపర్చాలని ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె.తారకరామారావు ఆటో డ్రైవర్లకు విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని భరోసా ఇచ్చారు. ఎల్‌బినగర్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రానున్న జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేయాలని కోరారు. ప్రతి ఒక్క ఆటో రిక్షాకు టిఆర్‌ఎస్ జెండా కట్టాలని కోరారు. ఆటో రిక్షా డ్రైవర్లకు రూ.5 లక్ష ప్రమాద భీమాతోపాటు రూ.77 కోట్ల పన్ను చెల్లింపును రద్దు చేసిన సంగతిని ఆయన గుర్తు చేశారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 1.5 లక్షల మంది ఆటోరిక్షా కార్మికులు ఉన్నారని, మీరంతా టిఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలవాలని మంత్రి కోరారు.

సభా సాంప్రదాయాలకు
తిలోదకాలిచ్చారు
రోజా సస్పెన్షన్‌పై సురేశ్‌రెడ్డి వ్యాఖ్య

హైదరాబాద్, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చే విధంగా ఉందని అసెంబ్లీ మాజీ స్పీకర్ కెఆర్ సురేష్‌రెడ్డి అన్నారు. రోజా సస్పెన్షన్ సభా సంప్రదాయాలకు భిన్నంగా ఉందని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సస్పెన్షన్ జరిగిందని అన్నారు. లోగడ తాను స్పీకర్‌గా ఉన్నప్పుడు జరిగిన కరణం బలరాం (అప్పుడు టిడిపి ఎమ్మెల్యే) సస్పెన్షన్‌ను, ఇప్పటి రోజా సస్పెన్షన్‌తో పోల్చలేమని ఆయన తెలిపారు. కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడానికి ముందు అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేయడం జరిగిందని, కమిటీ నివేదిక ఆధారంగా చర్య తీసుకున్నట్లు చెప్పారు.