తెలంగాణ

మన నగరం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 16: మనం మారుదాం, మన నగరాన్ని మారుద్దాం అనే స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో కలిగించేందుకు మన నగరం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు స్పష్టం చేశారు. కుత్భుల్లాపూర్‌లో ఈ కార్యక్రమాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ నగరం నాది, మనది అనే సామాజిక స్పృహతోనే స్వచ్ఛ హైదరాబాద్ సాధ్యమవుతుందని అన్నారు. స్వచ్ఛ నమస్కారం అని తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ సమస్యల అధ్యయనం, పరిష్కారంతో పాటు ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా నడవడమే మన నగర కార్యక్రమ ఉద్దేశ్యమని వివరించారు. ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం కానీ, ఎవరినీ వేలెత్తి చూపే కార్యక్రమం కాదని, నిజాయితీగా చిత్తశుద్దితో సమస్యల పరిష్కార వేదికే మన నగరమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని గుడిసెలు లేని నగరంగా, వౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర ఎన్నో మెగా కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే మెరుగైన పౌర సేవలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న 30 జిహెచ్‌ఎంసి సర్కిళ్లకు మరిన్ని అదనంగా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిహెచ్‌ఎంసి పరిధిలో ఇటీవలే 13,800 మందిని వార్డు, ఏరియా కమిటీ సభ్యులుగా నియమించామని, వీరందరి భాగస్వామ్యం, ప్రజలను మమేకం చేస్తూ హైదరాబాద్ నగరాన్ని దేశంలోనే స్వచ్ఛ నగరంగా రూపొందించేందుకు కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. మన నగరం కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, బస్తీ, ఏరియా కమిటీ సభ్యులు, స్వచ్ఛ సిఆర్‌పిలు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతో వివిధ పథకాల అమలుపై వారి అభిప్రాయాలను సేకరించారు.

చిత్రం..శనివారం హైదరాబాద్‌లో మన నగరం కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్