తెలంగాణ

నల్లధనాన్ని అరికట్టేందుకు కొత్త ప్రతిపాదన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: క్రీడలకు సంబంధించి మార్కెట్‌లో జోరుగా సాగే బెట్టింగ్‌లు, ఇంకా రకరకాల గ్యాంబ్లింగ్ జూదాలను చట్టబద్ధత చేస్తే నల్లధనం చలామణిని అరికట్టవచ్చని లా కమిషన్ కేంద్రానికి నివేదిక ఇచ్చింది. అలాగే ముసాయిదా బిల్లును కూడా రూపొందించింది. బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌లకు చట్టబద్ధత కల్పించినా, వీటిపై నియంత్రణ కఠినంగా ఉండాలని కేంద్రాన్ని లా కమిషన్ కోరింది. ఈ జూదాలకు చట్టబద్ధత కల్పించడం వల్ల అక్రమ ఆటలు, నల్లధనం చలామణిని గణనీయంగా అరికట్టవచ్చు. పైగా ప్రభుత్వ ఖజానాకు పన్నుల రూపంలో పెద్ద మొత్తంలో సొమ్ము వస్తుంది. ఒక వేళ గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లకు చట్టబద్ధత కల్పించకపోతే, వీటిపై ఉక్కుపాదం మోపి కఠిన చట్టాలు తేవాల్సి ఉంటుందని కూడా లా కమిషన్ కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చింది. దేశంలో గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లపై సాలీనా రూ.3లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతోందని అంచనా. చట్టబద్ధత కల్పిస్తే, దాదాపు సాలీనా రూ.13వేల కోట్ల ఆదాయం ఖజానాకు చేరుతుందని అంచనా. అక్రమ మార్గాల్లో నిర్వహించే ఈ జూదం వల్ల వచ్చే నిధుల్లో చాలా మటుకు టెర్రరిస్టు కార్యకలాపాలు, జాతి విద్రోహ కార్యకలాపాలకు మళ్లుతోందని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది.
సుప్రీం కోర్టులో 2013లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌పై ఒక పిల్ దాఖలైంది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ రెండు జూదాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని లా కమిషన్‌ను కోరింది. లా కమిషన్ చేసిన సిఫార్సుల ప్రకారం క్రీడల్లో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వ్యాపార నిర్వహణకు లైసెన్సులను ప్రభుత్వం మంజూరు చేయాలి. నగదు రహితంగా ఈ కార్యకలాపాలు జరగాలి. ఆదార్, పాన్ కార్డులను ఈ కార్యకలాపాలకు అనుసంధానం చేయాలని లా కమిషన్ కేంద్రానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఈ జూద క్రీడల్లో పాల్గొనేవారు కూడా ఆదార్, పాన్ కార్డుఅనుసంధానం చేస్తేనే అర్హత విధించాలి. నగదుతో ఈ జూదాన్ని నిర్వహించే పక్షంలో భారీ ఎత్తున ఐపిసి కింద శిక్షలు విధించే విధంగా చట్టంలో మార్పులు తేవాలని లా కమిషన్ ప్రతిపాదించింది. ఈ నివేదికను తయారు చేసే ముందు ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ రెండు జూద క్రీడల అంశాన్ని అధ్యయనం చేసింది. ఈ క్రీడలకు చట్టబద్ధతకల్పిస్తే మ్యాచ్ ఫిక్సింగ్, స్పోర్ట్స్ ఫ్రాడ్ కేసులను నేరపూరిత కేసులుగా నమోదు చేయాలని సిఫార్సు చేశారు. వాస్తవానికి బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ రాష్ట్రం పరిధిలోకి వచ్చే అంశం. 1867 పబ్లిక్ గ్యాంబ్లింగ్ చట్టం కింద వీటి పర్యవేక్షణ సాగుతోంది. చాలా రాష్ట్రాలు గ్యాంబ్లింగ్, బెట్టింగ్ లాటరీలపై నిషేధం విధించాయి. భారత్‌లో గుర్రం పందేలు చట్టబద్ధం. ఇక్కడ బెట్టింగ్‌కుచట్టబద్ధత కల్పించారు. దీనిని నైపుణ్యంతో కూడిన క్రీడగా భావిస్తారు. ఈ జూద క్రీడలకు సంబంధించి గేమ్ ఆప్ స్కిల్, గేమ్ ఆఫ్ లక్ అదే పదాలను జాగ్రత్తగా నిర్వచనం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క పార్లమెంటు మాత్రమే జూద క్రీడలపై చట్టం తెచ్చే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఒక నిర్ణీత కాలం ఎన్నిసార్లు గ్యాంబ్లర్ ఆడాలనే నిబంధనను కఠినంగా ఉపయోగించాల్సి ఉంటుంది. కేంద్రమే దీనికిసంబంధించి ఒక మోడల్ లాను రూపొందించాల్సి ఉంటుంది. గ్యాంబ్లింగ్‌లో పిల్లలు ఆడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. గ్యాంబ్లింగ్‌ను ప్రోపర్ గ్యాంబ్లింగ్, స్మాల్ గ్యాంబ్లింగ్‌గా వర్గీకరించినట్లు సమాచారం. బుకీస్, పంటర్స్‌పై భారీ ఎత్తున పన్నులు విధించాలని, దీనికి సంబంధించి పటిష్టమైన శాసనాలను తేవాలని లా కమిషన్ కేంద్రాన్ని కోరింది. గ్యాంబ్లింగ్‌కు సంబంధించిన చట్టాల్లో సరైన స్పష్టత లేనందున ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చట్టాలు చేసుకునే అధికారం ఉన్నా, ఈ చట్టాలు ఏకీకృతంగా లేవు. వీటిల్లో పేకాట, జంతువులతో ఆడే జూద క్రీడలపై ఇప్పటికే నిషేధం అమలులో ఉంది. అంతేకాని ఆన్‌లైన్, వర్చువల్ గ్యాంబ్లింగ్‌లు లేవు. లా కమిషన్ చైర్మన్ జస్టిస్ బిఎస్ చౌహాన్ లండన్‌కు వెళ్లి జూదక్రీడలపై అధ్యయనం చేశారు. క్యాసినో, లాటరీలు, బెట్‌మార్కెట్ల ఆర్గనైజర్లతో మన దేశ బృందం మాట్లాడింది. కొన్ని దేశాల్లో క్యాసినో, లాటరీలు, బెట్‌మార్కెట్లకు చట్టబద్ధత ఉంది. జూద క్రీడల చట్టం తేవాలంటే ఇండియన్ కాంట్రాక్టు చట్టానికి కూడా సవరణలు చేయాల్సి ఉంటుంది.