తెలంగాణ

పీహెచ్‌సీపై సీబీఐ కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 17: హైదరాబాద్‌కు చెందిన పిహెచ్‌సీ రిటైల్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సహా పలువురు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అధికారులపై సీబీఐ (చెన్నై) కేసు నమోదు చేసింది. నకిలీ ధ్రువీకణ పత్రాలు సమర్పించి రూ. 133.95 కోట్ల రుణం పొందిన వారిపై విచారణ సాగుతోంది.
పీహెచ్‌సీ మేనేజింగ్ డైరెక్టర్ బల్వీందర్ సింగ్, డైరెక్టర్ బల్జిత్ కౌర్, ఛార్టెడ్ అకౌంటెంట్ భావేశ్ ఆర్ విథ్లానీ, వర్సంత్ హోం అప్లయెనె్సస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తరణ్ జ్యోత్ సింగ్, నలుగురు బ్యాంక్ అధికారులపై ఐపీసీ 120బీ, 420 సెక్షన్ల కింద సీబీఐ కేసులు నమోదు చేసింది. సికిందరాబాద్‌లోని పీసీహెచ్ రిటేల్ లిమిటెడ్ కంపెనీ 2007 నుంచి ఎస్‌బీఐ ద్వారా లావాదేవీలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో సదరు కంపెనీ బినామీ పేర్లతో నకిలీ పత్రాలు సృష్టించి సుమారు 133.95 కోట్లు అక్రమాలకు పాల్పడింది. ఎస్‌బీఐ నుంచి పొందిన రుణాలు ఎగవేసేందుకు యత్నించడంతోపాటు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడిన ఆరుగురిపై సీబీఐ కేసు నమోదు చేసి, వారి లావాదేవీలను నిలిపివేసినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి.