తెలంగాణ

ఎడారిలా గోదావరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, ఏప్రిల్ 29: కరీంనగర్ జిల్లా ధర్మపురిలో మునె్నన్నడూ లేని విధంగా తాగునీటికి కలుగుతున్న ఇబ్బందులు వర్ణానాతీతంగా మారాయి. క్షేత్రాన్ని ఆనుకుని ప్రవహించే జీవనది గోదావరి కనీవినీ ఎరుగని రీతిలో ఎండిపోవడం, నీరు గణనీయంగా తగ్గడంతో స్థానికులు, ఇక్కడికి వచ్చే భక్తులు కష్టాలను అనుభవిస్తున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం నుండి నిర్వహించ బడుతున్న రక్షిత నీటి పథకం క్షేత్ర అవసరాలను తీర్చజాలని స్థితిలో కేంద్రప్రభుత్వ నిధులతో పూర్తి చేయబడిన 6 గ్రామాలకు త్రాగు నీరందించగల బృహత్ నీటి పథకం కూడా, దాని మూలాధారమైన రోళ్ళ వాగు ప్రాజెక్టులోనూ నీటి మట్టం గణనీయంగా పడిపోయిన సందర్భంలో, నీటి సరఫరాలో నిరంతర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, నీటి వనరులలో నీరు లేని దుస్థితి, కారణాలుగా త్రాగు నీటికోసం క్షేత్ర వాసులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
స్థానికుల సమస్యే తీరేలా లేకుంటే అనునిత్యం దైవ దర్శనాలకు విచ్చేసే భక్తులు స్నానాలు, తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అనునిత్యం భక్తజన సందడిగా ఉండే క్షేత్రానికి సుదూర ప్రాంతాలనుండి సనాతన సాంప్రదాయాచరణలో భాగంగా వచ్చే యాత్రికులతో పాటు, వివిధ దైవ దీక్షాపరులు, వివిధ ఉత్సవాలలో పాల్గొనడానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం గోదావరి నది ఎగువ భాగాన తాత్కాలిక ప్రాతిపదికన షవర్లు ఏర్పాటు చేశారు. వేలాది సంవత్సరాల చరిత్రలో కనీ, వినీ, ఎరగని రీతిలో బ్రహ్మగుండంలో క్షణక్షణానికి నీటిమట్టం గణనీయంగా తగ్గి ఊహించని రీతిలో ఇంకిపోయి బండరాళ్ళు, ఇసుక మేటలు బహిర్గతమైనాయి. బ్రహ్మగుండంలోనూ నీరు ఇంకిపోగా, ప్రత్యామ్నాయ మార్గం లేక క్షేత్రవాసులు భయభ్రాంతులకు గరవుతున్నారు. ప్రస్తుతం 4 కి.మీ దూరాన గల దేవతల మడుగు దిక్కయ్యంది. 41లక్షలతో చేపట్టిన సదరు పనులు త్వరితగతిన పూర్తి చేసి, నీరు సరఫరా చేయడం అనివార్యంగా మారింది. ఇందుకోసం స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు నిరంతరం మొర పెట్టుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు.