తెలంగాణ

గ్రామాల్లో ఏడాది పని నిబంధనకు చెల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 30: ఎంబిబిఎస్ విద్యార్ధులు గ్రామాల్లో ఏడాదిపాటు సేవ చేయాలనే నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్ తివారి జీవో ఎంఎస్ నెంబర్ 28ను జారీ చేశారు. చాలాకాలంగా జూనియర్ డాక్టర్లు ఈ నిబంధనను తొలగించాలని తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు. పదేళ్లుగా జూనియర్ డాక్టర్లు ఐదు ప్రధాన డిమాండ్లపై సమ్మె చేస్తుండగా ఆ ఐదింటిలో ఇదో ప్రధాన డిమాండ్‌గా ఉంది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో కనీసం మూడున్నరేళ్లు పనిచేయాలనే నిబంధన ఉండేది. జూనియర్ డాక్టర్ల సమ్మెతో దానిని ఏడాదికి తగ్గించారు. దానిని సైతం తొలగించాలని సమ్మె చేయడంతో అదికాస్తా హైకోర్టు వరకూ వెళ్లింది. జూనియర్ డాక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ క్రమంలో తెలంగాణ జూనియర్ డాక్టర్ల సంఘం గత ఏడాది ఆగస్టు 17వ తేదీన ఒక వినతి పత్రం ఇచ్చింది. అందులో ప్రధానంగా గ్రామాల్లో సేవకు సంబంధించి చేర్చారు. దీనిని పరిశీలించిన తర్వాత వైద్య విద్య సంచాలకుడి సిఫార్సు మేరకు ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.