తెలంగాణ

ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించేందుకు ప్రత్యేకాధికారిని నియమించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: సిద్ధిఅంబర్ బజార్‌లో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించేందుకు, పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని హైదరాబాద్ నగర మున్సిపల్ కమిషనర్‌ను హైకోర్టు శుక్రవారం నాడు ఆదేశించింది. నగర మున్సిపల్ అధికారులకు గట్టి సంకల్పం ఉంటే ఆక్రమణలను తొలగించడం కష్టమేమీ కాదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ జి శ్యాం ప్రసాద్‌లతో కూడిన బెంచ్ పేర్కొంది. లక్ష్మీ నివాస్ అగర్వాల్ దాఖలు చేసిన పిటీషన్‌పై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. గతంలో న్యాయస్థానం ముందు ఆక్రమణలకు పాల్పడబోమని హామీ ఇచ్చిన షాప్ ఓనర్ల జాబితాను న్యాయస్థానం ముందుంచాలని జిహెచ్‌ఎంసి కమిషనర్ బి జనార్ధనరెడ్డిని ఆదేశించింది. ఇంత వరకూ ఎన్ని షాప్‌లను తొలగించారో ఆ జాబితా కూడా కోర్టు ముందుంచాలని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు
యాప్రాల్‌లో మూడెకరాల్లో క్రిస్టియన్ భవన్ నిర్మాణంపై గతంలో హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన స్టే ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు అప్పీలు చేసింది. భూ హక్కు దారులకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, అయితే వారి నుండి సమాధానం రాలేదని దాంతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని ఎజి డి సూర్యప్రకాష్‌రెడ్డి పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధ్, జస్టిస్ జి శ్యాం ప్రసాద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.