తెలంగాణ

ఆటో మొబైల్ రంగానికి తెలంగాణ అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ఆటో మొబైల్ రంగ ఈకో సిస్టమ్ తెలంగాణ అత్యంత అనుకూలమైందని పరిశ్రమలశాఖ మంత్రి కె తారకరామారావు అన్నారు. తెలంగాణలో ఇప్పటికే ఆటోమొబైల్ యాన్సిలియరీ కంపెనీలు ఉన్నాయన్నారు. ఎంఆర్‌ఎఫ్, మహీంద్రా, జెడ్‌ఎఫ్ వంటి పలు ప్రముఖ సంస్థలు తెలంగాణలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయన్నారు. ఆటోమొబైల్ రంగ పెట్టుబడులకు అవసరమైన అన్ని రకాల సహాకారులు అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేసారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన సొసైటీ ఆఫ్ ఆటో మొబైల్ మ్యాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సియామ్) కార్యనిర్వాహక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి కెటిఆర్ ప్రసంగించారు. ఆటో మొబైల్ రంగంలో పరిశోధన, ఇన్నోవేషన్ రంగాల్లో ముందంజలో ఉండేందుకు మొబిలిటీ రీసెర్చ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ఆటో మొబైల్ రంగాభివృద్ధికి సియామ్, అక్మా సంస్థలతో కలిసి పని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడానికి ముందు తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం ఉండేదన్నారు. రాష్ట్రం ఏర్పడి తమ ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, నీరు, విద్యుత్ సరఫరాను అందిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం మాన్యుఫాక్చరింగ్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఆటో మొబైల్ రంగ పెట్టుబడులకు సంపూర్ణ సహాకారం అందిస్తామన్నారు. ఆటో మొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టే కంపెనీల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వమే టాస్క్ ద్వారా శిక్షణ ఇచ్చి మానవ వనరులను అందిస్తుందని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు.
సియామ్ ప్రతినిధులు మాట్లాడుతూ, దేశంలో 28 మిలియన్ వాహనాలు తయారవుతుండగా ఇందులో 25 లక్షల వాహనాలు స్థానికంగానే విక్రయిస్తున్నామన్నారు. తమ రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక డైనమిక్ రాష్ట్రంగా పరిగణిస్తున్నామని సియామ్ ప్రతినిధులు కొనియాడారు. ప్రభుత్వం నుంచి తమకు పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు.

చిత్రం..శుక్రవారం హైదరాబాద్‌లో సియామ్ కార్యనిర్వాహక సమావేశంలో ప్రసంగిస్తున్న మంత్రి కేటీఆర్