తెలంగాణ

విద్యార్థి ఉద్యమాలపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: తెలంగాణలో వివిధ యూనివర్శిటీల్లో ప్రధానంగా, ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థిఉద్యమాలు హెచ్చుమీరడంపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. విద్యార్థులు తప్పనిసరి తరగతులు హాజరయ్యేలా చూడాలని, అలాగే లెక్చరర్లు పాఠాలు తప్పనిసరి చెప్పేలా చూడాలని ప్రభుత్వం వివిధ వర్శిటీల వైస్ ఛాన్సలర్లకు ఆదేశాలిచ్చింది. విద్యార్థి ఉద్యమాలు చూస్తుంటే హద్దు మీరుతోందని, దీనిని మొగ్గలోనే తుంచేయకపోతే వ్యవహారం చేయి దాటుతుందని భావిస్తున్న ప్రభుత్వం వైస్ ఛాన్సలర్లు నిష్క్రియాత్మకంగా కాకుండా వీటిని అదుపు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. అవసరమైతే ఉన్నత విద్యామండలి చొరవ తీసుకుని విద్యార్థుల వ్యవహారంపై దృష్టి పెట్టాలని , ప్రతి యూనివర్శిటీలో విద్యార్థులతో వివిధ సంఘాల నాయకులతో మాట్లాడి , యూనివర్శిటీల్లో విద్యాకార్యకలాపాలు సజావుగా సాగేలా ప్రభుత్వం సూచించింది. తాజాగా ఉస్మానియా యూనివర్శిటీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఉత్సవాలను వాయిదా వేయాల్సి వచ్చిందనే ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్న తరుణంలో సైన్స్ కాంగ్రెస్ విషయంలో ప్రభుత్వ పరువు పోయేలా విద్యార్థుల వ్యవహార సరళి ఉండటం సరికాదని శుక్రవారం నాడు ఉన్నత విద్యామండలి నిర్వహించిన సమావేశంలో పలువురు విద్యానిపుణులు అభిప్రాయపడ్డారు. విద్యార్ధులకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉన్నా, వివిధ అంశాలపై పరిమితి మేరకు భాగస్వామ్యం కావాలని, సమకాలీన అంశాలపై చర్చలు నిర్వహించడం , అభిప్రాయాలు చెప్పడం తప్పుకాకపోయినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా పరిస్థితి చేయిదాటడాన్ని మాత్రం సహించేది లేదని, దీనిని ఒక సాధారణ అంశంగా తీసుకోకుండా విద్యార్థి సంఘాల నేతలను అదుపుచేయాలనే ప్రభుత్వ భావనను విసిలకు చాలా గట్టిగా చెప్పింది. త్వరలోనే ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడా జారీ చేయనున్నట్టు తెలిసింది.

చిత్రం..శుక్రవారం హైదరాబాద్‌లో ఉన్నత విద్యామండలి
నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న విద్యారంగ నిపుణులు