తెలంగాణ

ప్రాణహిత-చేవెళ్ళ ‘కాకా’ స్వప్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు కేంద్ర మాజీ మంత్రి దివంగత జి. వెంకటస్వామి ‘స్వప్నం’ అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం పూర్తి కావడమే ఆయనకు నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. శుక్రవారం ‘కాకా’ మూడవ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తూ ప్రస్తుత కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న అప్పటి ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టు వెంకటస్వామి చలవేనని అన్నారు. అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నీళ్ళు లేని చోట ప్రాజెక్టును ప్రతిపాదించిందని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నీళ్ళు లభ్య ఉన్న మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ప్రాజెక్టుకు రీ-డిజైన్ చేశారని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అతి త్వరలో పూర్తి కాబోతున్నదని కాకాకు అదే నిజమైన నివాళి అని ఆయన తెలిపారు. గత పాలకులు నీళ్ళను తరలించుకుపోతుంటే కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఊరుకున్నారని, అయితే ‘కాకా’ మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డిని ధిక్కరించారని ఆయన గుర్తు చేశారు. ‘కాకా’ కలను త్వరలో సాకారం చేయబోతున్నట్లు ఆయన చెప్పారు. కాకా అన్ని పదవులు అధిష్టించారని, అయినా అహంభావం లేకుండా సామాన్య ప్రజలు, కార్మికులతోనే నిరాడంబరంగా తిరిగారని ఆయన చెప్పారు. కాకా శక్తివంమైన కార్పొరేట్ లాబీయింగ్‌ను తట్టుకుని కార్మికులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయించారని మంత్రి తెలిపారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కాకాకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన తెలిపారు. కాకాను అత్యున్నతంగా గౌసరివించుకోవాలన్న ఉద్దేశ్యంతో ట్యాంక్ బండ్‌పై కాకా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. కాకా పోరాట స్పూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ సాధన కోసం 2001లో ఉద్యమించిన సమయంలో చాలా మంది అవహేళన చేశారని, కానీ పట్టుదలగా 14 ఏళ్ళ పాటు శ్రమించి తెలంగాణ సాధించారని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్‌వి సత్యనారాయణ, తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ చక్రపాణి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, మాజీ ఎంపి డాక్టర్ జి. వివేక్ తదితరులు ప్రసంగించారు.
కాకా సేవలు చిరస్మరణీయం అని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు అన్నారు. కాకా వర్ధంతి సందర్భంగా ట్యాంక్ బండ్‌పై ఉన్న విగ్రహానికి రాములు పూల దండ వేసి నివాళి అర్పించారు.
చిత్రం.. ‘కాకా’ మూడవ వర్ధంతి సందర్భంగా వెంకటస్వామి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి హరీశ్‌రావు