తెలంగాణ

కొత్త సంవత్సర వేడుకలపై హైదరాబాద్‌లో ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు నగర పోలీస్ కమిషనర్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. పబ్‌లు, క్లబ్‌లు, బార్లు, ఈవెంట్ నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సీపీ సూచించారు. మైనర్లను అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, తాగిన వారికి డ్రైవర్, క్యాబ్‌ను సమకూర్చాల్సిన బాధ్యత నిర్వాహకులదేనని కమిషనర్ పేర్కొన్నారు. నూతన సంవత్సర జోష్‌కు డ్రగ్స్‌తో మరింత మత్తును పెంచేందుకు అంతర్రాష్ట ముఠాలు నగరాన్ని ఎంచుకున్నాయి. ఈ వేడుకల్లో యువత నిర్వహించే విందు, వినోదాల్లో డ్రగ్స్ సరఫరా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. మంగళూరు, గోవా నుంచి కొకైన్, ఎల్‌ఎస్‌డీ, బ్రౌన్ షుగర్‌ను తమ ఏజెంట్ల ద్వారా టోలీచౌకీ, మాదాపూర్, సికిందరాబాద్, సైనిక్‌పురి, యాప్రాల్‌కు తరలించినట్టు పోలీసులకు ప్రాథమిక సమాచారం అందినట్టు తెలిసింది. రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల కేసులో అరెస్టయిన కెల్విన్ ముఠాపై ఇప్పటికే పోలీసులు నిఘా పెట్టారు. నగరశివారులోని ఫాంహౌస్‌లు, హుక్కా సెంటర్లపై కూడా పోలీసులు నిఘా పెంచారు.