తెలంగాణ

కొడుక్కు తల్లి భారమైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, డిసెంబర్ 24: నవ మాసాలు మోసి కని పెంచిన తల్లిని గెంటేశాడో కొడుకు... చివరి మజిలీలో ఆదరించాల్సిన తనయుడు తనను కన్నపేగును పెంట కుప్పలపాలు చేశాడు... పర్యవసానంగా రెండు రోజులు చలిలో రోడ్డు పక్కన దుర్భర జీవితాన్ని గడిపిందా వృద్ధురాలు. జన్మనిచ్చిన తల్లికి పిడికెడు మెతుకులు పెట్టడం ఆ కొడుక్కి భారమైంద(టా)..! వెళ్తే...70 ఏళ్లు పైబడ్డ కె.జగదాంబను ఆమె కొడుకు రోడ్డు పక్కన వదిలేసిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో చోటుచేసుకుంది.
స్థానిక కళ్యాణ్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న వెంకటాద్రి అనే వండ్రంగి వృత్తిదారునికి ముగ్గురు పిల్లలు, తల్లి ఉన్నారు. కుటుంబ పోషణ బరువయ్యిందో ఏమో... లేక మరేఇతర కారణమో... కానీ తల్లి భారాన్ని తప్పించుకోవాలనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ తల్లిని రెండు రోజుల క్రితం స్థానిక పాత డిగ్రీ కళాశాల గోడ పక్కనే వదిలి వెళ్లడంతో ఆదివారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ గజ్జి క్రిష్ణ ఆ వృద్ధురాలిని పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర ఆశ్రమానికి తరలించి నిర్వాహకుడు కౌటంబాబు పర్యవేక్షణలో సపర్యలు చేయించారు.

చిత్రం..చెత్తకుప్పలో ఉన్న వృద్ధురాలు