తెలంగాణ

హరీశ్‌రావు పునర్జన్మ ప్రసాదించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: తమ కూతురికి మంత్రి హరీశ్‌రావు పునర్జన్మను ప్రసాదించారని ఒక నిరుపేద కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. మంత్రి హరీశ్‌రావు అందించిన ఆర్థిక సహాయంతో చిన్నారి గుండెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. కోలుకున్న చిన్నారిని వెంటబెట్టుకొని ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్‌కు వచ్చి మంత్రికి ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలియచేసింది. మెదక్ జిల్లా తుఫ్రాన్‌కు చెందిన చంద్రం నిరుపేద. ఆయన ఏడు సంవత్సరాల కూతురు అక్షయ క్లిష్టమైన గుండె సంబంధ వ్యాధితో బాధపడుతుంది.
తమ కూతురి ప్రాణాలు కాపాడాలని ఎంత మందిని వేడుకున్నా ఫలితం లేకపోయింది. ఈ విషయాన్ని చంద్రానికి తెలిసిన వ్యక్తి ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వెంటనే స్పందించిన మంత్రి హరీశ్‌రావు చంద్రాన్ని హైదరాబాద్‌కు పిలిపించుకుని పాపను నీలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అక్కడి వైద్యులు బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా రేఫర్ చేసారు. కేర్ ఆస్పత్రిలో పాపకు అవసరమైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 4 లక్షలను మంత్రి హరీశ్‌రావు అందజేసారు. అక్షయ గుండె రక్తనాళానికి కేర్‌లో స్టంట్ వేయడంతో ఆ పాపా పూర్తిగా కోలుకుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అక్షయను వెంటబెట్టుకుని చంద్రం ఆదివారం మంత్రిని కలిసి తమ పాపకు ప్రాణదానం చేసారని కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రం..నిరుపేద బాలిక అక్షయకు మంత్రి హరీశ్‌రావు అందించిన ఆర్థిక సహాయంతో శస్త్ర చికిత్స అనంతరం ఆదివారం మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం