తెలంగాణ

‘మెట్రో రైలు చార్జీలు తగ్గించాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 24: మెట్రో రైలు ఛార్జీలు పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో లేవని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. ఆదివారం డాక్టర్ లక్ష్మణ్ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తార్నాక రైల్వే స్టేషన్ నుంచి అమీర్‌పేట స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మెట్రో రైలు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇక పాతనగరంలో మెట్రో రైలు కోసం వెంటనే పనులు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పాతనగరంలోని ఫలక్‌నుమా నుంచి ఎంజిబిఎస్ వరకు మెట్రో రైలును నడిపిస్తే అక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
రవళి రాజీనామా?
ఇలాఉండగా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు రవళి తన పదవికి, పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌కు లేఖ పంపించినట్లు సమాచారం.