తెలంగాణ

ప్రైవేట్‌పై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 1: ప్రైవేట్ విద్యాసంస్థల ఆగడాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ప్రైవేట్ విద్యాసంస్థలో నాణ్యతలేని విద్యతో పాటు తల్లిదండ్రులకు పెనుభారంగా మారిన ఫీజుల మోతకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తున్న సంస్థలపై ఉక్కుపాదం మోపే విషయంలో రాజీ పడకూడదని గట్టి పట్టుదలతో ఉంది. ప్రభుత్వం నుంచి ఫీజు రియింబర్స్‌మెంట్ పొందడం కోసమే వెలిసిన ఇంజనీరింగ్, ఫార్మసి, మెడికల్, ఇతర వృత్తి విద్యాసంస్థలను గాడిలో పెట్టాల్సిందిగా సిఎం కెసిఆర్ ఇటీవల జరిపిన సమీక్షా సమావేశంలో ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సిఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు కోర్టులను ఆశ్రయించడం, ఎంట్రెన్స్ టెస్ట్‌లకు సహాయ నిరాకరణ చేయనున్నట్టు ప్రకటించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలపై టాస్క్ఫోర్స్ కమిటీ సమర్పించిన నివేదికను వెలికి తీసి దాని ప్రకారం చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. కనీస వసతి సౌకర్యాలు లేకుండా కేవలం ఫీజు రియింబర్స్‌మెంట్ కోసమే వెలిసిన విద్యాసంస్థలపై కొరడా జుళిపించే దిశగా అధికారులు చర్యలకు ఉద్యక్తమవుతున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) నిబంధనల ఉల్లంఘన, అలాగే అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ అథారిటీ (ఎఫ్‌ఆర్‌సి) నిబంధనలను పాటించని కాలేజీలపై ఉమ్మడి రాష్ట్రంలో 2012లో టాస్క్ ఫోర్స్ కమిటీ ద్వారా తనఖీలు చేయించింది. అప్పట్లో రాష్టవ్య్రాప్తంగా 684 కాలేజీలను టాస్క్ఫోర్స్ కమిటీ తనఖీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. వీటిలో తెలంగాణ ప్రాంతంలోని 388 కాలేజీలు ఉన్నాయి. వీటిలో 174 కాలేజీలు నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్నట్టు టాస్క్ఫోర్స్ కమిటీ వెల్లడించింది. పట్టణ ప్రాంతాలోని వృత్తి విద్యా కాలేజీలకు రెండున్నర ఎకరాలు, గ్రామీణ ప్రాంతంలోని కాలేజీలకు పది ఎకరాల స్థలం తప్పని సరిగా ఉండాలని ఏఐసిటిఇ నిబంధనలు ఉన్నాయి. అయితే 319 కాలేజీలు నిబంధనల మేరకు స్థలం లేదని టాస్క్ఫోర్స్ కమిటీ వెల్లడించింది. అలాగే 393 కాలేజీలకు కనీసం కంప్యూటర్ ల్యాబులు లేవని కమిటీ తేల్చింది. అలాగే 146 కాలేజీలలో లైబ్రరీలు లేనట్టు కమిటి పేర్కొంది. రాష్టవ్య్రాప్తంగా (ఆంధ్ర, తెలంగాణ) 654 కాలేజీలకు 8398 అధ్యపకులు అవసరం ఉండగా 2182 మంది అధ్యపకులు మాత్రమే ఉన్నారని కమిటీ పేర్కొంది. పైగా నిబంధనల మేరకు ఉండాల్సిన అర్హులైన అధ్యపకులు కాకుండా ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఇంజనీరింగ్ గ్రాడ్యువేట్స్‌నే అధ్యపకులుగా నియమించుకున్నట్టు కమిటీ పేర్కొంది. ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయాల ఫీజు రియింబర్స్‌మెంట్ పొందుతున్నప్పటికీ దానికి అనుగుణంగా కాలేజీల్లో వౌలిక వసతీ సౌకర్యాలను కల్పించకపోవడం పట్ల ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. ప్రైవేట్ కాలేజీలు కలిగిన విద్యాసంస్థలే 60 శాతం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను నిర్వహిస్తున్నాయని కమిటీ పేర్కొంది. వీటిలో చాలా మటుకు కార్పొరేట్ విద్యాసంస్థల ఆధీనంలోనే పని చేస్తున్నట్టు పేర్కొంది. వీటిలో 90 శాతం విద్యాసంస్థలు అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ ఖరారు చేసిన ఫీజులను కాకుండా అత్యధికంగా వసూలు చేస్తున్నట్టు తాజాగా ప్రభుత్వానికి సమాచారం అందింది. వీటిని గాడిలో పెట్టకపోతే కెజి టు పిజి ఉచిత విద్య విధానం అమలు చేయడం కష్టసాధ్యమని ప్రభుత్వం భావిస్తుంది. నాణ్యమైన విద్యను అందించకపోవడంతో పాటు వీటిలో వసూలు చేస్తున్న ఫీజుల మోత పేద, మధ్య తరగతి ప్రజల తల్లిదండ్రులకు భారంగా మారిందని ప్రభుత్వం భావిస్తుంది. అయితే నిబంధనల మేరకు నడుచుకుని ప్రైవేట్ విద్యాసంస్థలపై తనఖీలు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించగానే ప్రైవేట్ విద్యాసంస్థలు సంఘంగా ఏర్పడి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం పట్ల ప్రభుత్వాన్ని మరింత ఆగ్రహానికి గురి చేసింది. దీంతో గతంలో ఇచ్చిన టాస్క్ఫోర్స్ నివేదికను వెలికితీసి నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై ఉక్కుపాదం మోపడం ద్వారా ప్రైవేట్ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలని భావిస్తుంది.