తెలంగాణ

అంతర్జాతీయ స్థాయికి సేద్యం వర్సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 26: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ఈ వర్సిటీ వైస్-్ఛన్సలర్ డాక్టర్ వి. ప్రవీణ్‌రావు తెలిపారు. ‘వ్యవసాయ పరిశోధన వ్యవస్థలో సామాజిక శాస్త్రాల పాత్ర’ అన్న అంశంపై మంగళవారం యూనివర్సిటీ కేంద్ర గ్రంథాలయంలో జరిగిన చర్చలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రవీణ్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పెంచేందుకు వీలుగా ఆసక్తి ఉన్న సంస్థలు, శాస్తవ్రేత్తలు ముందుకు వస్తే కలిసి పనిచేస్తామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అధ్యాపకులు, విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు అంతర్జాతీయ వరి పరిశోధనా కేంద్రం (ఇరి) అందిస్తున్న సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను సమర్థతగా ఎదుర్కొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఆర్థిక, సామాజిక శాస్తవ్రేత్తలు సహకారం అందించాలని కోరారు.
వ్యవసాయ పరిశోధనా ఫలాలను రైతుల ముందుకు తీసుకువెళ్లేందుకు సామాజిక శాస్తవ్రేత్తలు (వ్యవసాయ ఆర్థికవేత్తలు, విస్తరణ నిపుణులు) కీలకపాత్ర పోషించాలని ప్రవీణ్‌రావు కోరారు. ఎనిమిది దేశాలకు చెందిన శాస్తవ్రేత్తలు ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాధాన్యతలకు అనుగుణంగా వ్యవసాయ పరిశోధన లు నిర్వహించేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాల స్థాయిలో నిర్ణయాలు జరగాలని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్-్ఛన్సలర్ డాక్టర్ రామస్వామి పేర్కొన్నారు. నీటిలభ్యతపై భవిష్యత్తులో వరిసాగు ఆధారపడి ఉంటుందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని పరిశోధనలు జరపాలన్నారు. వ్యవసాయేతర ఆదాయంపై రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఇరి దక్షిణాసియా ప్రతినిధి డాక్టర్ నఫీస్‌మెహ పేర్కొన్నారు. వరి పంటకు సంబంధించి 21వ శతాబ్దంలో కూలీల కొరత అధికంగా ఉం టుందని, దాంతో యాంత్రీకరణ పూర్తిస్థాయిలో జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జపాన్‌కు చెందిన ప్రొఫెసర్ విజిరో ఓట్సుక పేర్కొన్నారు. చిన్న కమతాల సేద్యంలో సాగుఖర్చు పెరుగుతుందని, దానికి యాంత్రీకరణ ఒక్కటే మార్గమన్నారు. వరిసాగుకు అనుకూలమైన టెక్నాలజీపై ‘ఇరి’ దృష్టికేంద్రీకరించాలని మయన్మార్‌కు చెందిన డాక్టర్ టిన్‌హట్ పేర్కొన్నారు. దక్షిణాసియాకు చెందిన ఎనిమిది దేశాల వ్యవసాయ నిపుణులు, శాస్తవ్రేత్తలు స్టడీ కోసం హైదరాబాద్ వచ్చారు. ఇక్కడి వ్యవసాయ అధికారులు, శాస్తవ్రేత్తలు, విద్యార్థులతో వారు అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్ టి. ప్రదీప్, ఇరి ప్రతినిధులు డాక్టర్ ప్రకాశన్ సి. విట్తీల్, డాక్టర్ అల్దాస్ జానయ్య, హెచ్‌ఎన్ బండారి, ఎన్‌టి హోహన్, డాక్టర్ థలీమ్ సుదరయంటోతో తదితరులు మాట్లాడారు.
చిత్రం..అంతర్జాతీయ వరి పరిశోధనా కార్యక్రమంలో మాట్లాడుతున్న వ్యవలాయ వర్సిటీ వైస్-చాన్సలర్ డాక్టర్ ప్రవీణ్‌రావు