తెలంగాణ

గృహహింస నుంచి రక్షించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ డిసెంబర్ 27: భర్త, అత్త, మామలు వేధిస్తున్నారంటూ కోడళ్లు గృహహింస కేసులు పెట్టిన సంఘటనలు మనం చూశాం కానీ, దానికి భిన్నంగా భార్య, ఆమె కుటుంబ సభ్యులు తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ భర్త కోర్టు గుమ్మం తొక్కడం సంచలనం రేపుతోంది. భార్య, వారి కుటుంబ సభ్యులు పెట్టే గృహహింస బాధలు భరించలేక భర్త కరీంనగర్ అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయవాది ద్వారా దావా దాఖలు చేశారు.
ఈ మేరకు భార్య, వారి కుటుంబ సభ్యులకు కోర్టు సమన్లు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే..కరీంనగర్ పట్టణంలోని హుస్సేన్‌పురాకు చెందిన అబ్దుల్ మన్నాన్ (23), ఖాన్‌పురాకు చెందిన ఫాతిమా (26) ఇరువురు 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం హైదరాబాద్‌లో ఉండి మలేషియా వెళ్లడానికి ప్రయత్నాలు చేశారు. తర్వాత భార్యతో విభేదాలు వచ్చాయ. విదేశాలు వెళ్లడానికి అనుమతి లభించకపోవడంతో కరీంనగర్‌కు వచ్చి స్నేహితుల ఇంటిలో ఉండటంతో నగరానికి చెందిన కార్పొరేటర్ జోక్యం చేసుకొని ఫాతిమా కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి ఒకటయ్యేలా కృషి చేశాడు. తదుపరి భార్యా,్భర్తలు ఇరువురు హైదరాబాద్ వెళ్లగా అక్కడికి వచ్చిన ఫాతిమా తండ్రి ఆమెను తీసుకొని కరీంనగర్‌కు వచ్చాడు.
ఫాతిమా ఉన్నత చదువులు చదువుకుంటోందని, ఎలాగైనా విడాకులు ఇవ్వాలని అత్తింటి వారు బెదిరింపులకు గురి చేసినట్లు మన్నాన్ దావాలో పేర్కొన్నాడు. అంతేకాకుండా వరకట్న వేధింపులకు గురి చేసినట్టు భార్యతో క్రిమినల్ కేసు నమోదు చేయించారని, తాను దుబాయి వెళ్లి ఇండియాకు రాగానే ఎయర్‌పోర్టులోనే అరెస్ట్ చేయించారని పేర్కొన్నారు. అత్త, మామ, వారి కుటుంబ సభ్యుల నుండి రక్షణ కల్పించాలని, తన భార్యను తన వద్దకు వచ్చేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయాలని సదరు దావాలో పేర్కొన్నాడు. తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేసినందుకు నష్టపరిహారం కింద రూ.10 లక్షలు భార్య, ఆమె కుటుంబ సభ్యుల నుండి ఇప్పించాలని దావాలో తెలిపాడు. కేసును స్వీకరించిన న్యాయమూర్తి సంపతీరావు చందన, ఫాతిమాతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారు.