తెలంగాణ

తెలంగాణలో ఇతర పార్టీలకు భవిష్యత్ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 2: తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలకు భవిష్యత్ లేదని, త్వరలోనే వైసిపి తరహాలో టిడిపి నేతలంతా టిఆర్‌ఎస్‌లో చేరనున్నారని రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సోమవారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించేందుకు ఖమ్మం వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడి పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజల ఆదరణ బాగుందన్నారు.
ఇతర పార్టీల నేతలు ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని చూసి తమ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే పొంగులేటిని తమ పార్టీలో చేరాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్లుగా రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని అన్నారు. ఖమ్మం జిల్లాలో ప్లీనరీకి ముందు ఒక శాసనసభ్యుడు, ప్లీనరీ తర్వాత ఎంపి, ఎమ్మెల్యేతో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం అంతా టిఆర్‌ఎస్‌లో చేరుతుండటం సంతోషకరమైన పరిణామమన్నారు. పొంగులేటి చేరికతో తెంలగాణ రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్ మరింత బలోపేతం అయిందన్నారు. పొంగులేటి చేరికతో పాలేరు ఎన్నికలో తమ మెజార్టీ మరింత పెరగనుందని అంటూ పొంగులేటికి పార్టీలో సముచిత గౌరవం కల్పిస్తామని మంత్రి కెటిఆర్ ప్రకటించారు.