తెలంగాణ

పోలీసులకు సవాల్‌గా సెక్స్ రాకెట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 28: సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తత్రంగా విస్తరించడంతో ఆ తరహాలోనే నేరాలు పెరుగుతూ వస్తున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు ఆన్‌లైన్ విధానమే వేదిక అవుతోంది. ఇంటర్నెట్ ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నా, అంతే స్ధాయి లో అవస్థలు వచ్చిపడుతున్నాయి. భారీ సైబర్ నేరాలు, మోసాలు సంగతి ఎలా ఉన్నా, సెక్స్ రాకెట్ల విషయానికొస్తే గల్లీ స్ధాయి వ్యభిచార వృత్తి కాస్త ఆన్‌లైన్‌లోకి ఎక్కింది. ఎస్కార్ట్ పేరుతో ఒకరు, మరో పేరుతో ఇంకో వెబ్‌సైట్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో వ్యభిచార బుకింగ్, ఆన్‌లైన్‌లోనే విటులను ఆకర్షించడం, యువతులను పంపే ఏర్పాట్లు, నగదు చేతులు మారడం అంతా ఆన్‌లైన్ వ్యవస్ధే అయిపోయింది. ఇప్పటికే సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలు వేగం పుంజుకోవడం, వారి బాధితుల సంఖ్య రోజురోజుకీ బయటపడి వాటిని పరిష్కరించడమే పెద్ద పనిగా భావిస్తుంటే, ఆన్‌లైన్‌లో వ్యభిచార రాకెట్లు నడిపే వారిని పట్టుకోవడం అదో పెద్ద సవాల్‌గా పోలీసులకు ఎదురవుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఒకటి రెండు స్టార్ హోటళ్లలో జరిగిన దాడులు వెనుక పోలీసుల సైబర్ శోధన చాలానే ఉంది. నేరుగా ఆ హోటల్ రూమ్‌కే వెళ్లి దాడి చేసేందుకు సిద్దమయ్యారంటే దాని వెనుక చాలా కృషి చేశారు. ఇలాంటి వ్యభిచార కార్యకలాపాలకు చాలా సమయం వృధా చేసుకోవడం వల్ల మిగిలిన అతి ముఖ్యమైన నేరపరిశోధన పోలీసులకు తలనొప్పిగా మారింది. వ్యభిచార వృత్తి నిర్వహణ అనేది రోజు రోజుకీ కొత్త పద్దతులు, విధానాలను సంతరించుకుంటుంది. ఆన్‌లైన్ వేదిక ఒకటైతే, నేరుగా ఇళ్లు, అపార్టుమెంట్ల వద్ద జరిగేది మరో విధంగా ఉంటున్నాయి. తాజా లెక్కల ప్రకా రం రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సుమారుగా 82 వ్యభిచార కేసులు నమోదై ఉండగా, వాటిలో 106 మంది నిర్వాహకులను అరెస్టు చేశారు. ఆ కేసుల్లో తెలంగాణ, ఎపి, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వ్యభిచారం చేసేందుకు వచ్చిన వారిని భాధితులుగా గుర్తించి వారికి విముక్తి కల్పించారు. ఇక విదేశాల నుంచి యువతులను రప్పించి వారితో వ్యభిచారం చేయించే ముఠాలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. మాదాపూర్, అమీర్‌పేట, తదితర ప్రాంతాల్లో నివాసాలు అద్దెకు తీసుకుని థాయ్‌లాండ్, బ్యాంకాక్, గోవా, ముంబయి వంటి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువతులను తీసుకు వచ్చి భారీగా డబ్బు వసూళ్లు చేస్తున్నారు. మసాజ్ సెంటర్ల ముసుగులో థాయ్‌లాండ్ యువతులను తీసుకువచ్చి మరీ వ్యభిచారం చేయిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన యువతుల పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుని స్పాస్,మసాజ్ పార్లర్లలో పనికి పెట్టుకుని వారితో సెక్స్ రాకెట్లు నిర్వహించడం చాలా చోట్ల జరుగుతోంది.
పోలీసులు కూడా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో వ్యభిచార రాకెట్లను అదుపు చేయడం కోసం పోలీసు, టాస్క్ఫోర్స్ విభాగం పెద్ద కసరత్తు చేయాల్సి వస్తోంది.