తెలంగాణ

అంతర్ రాష్ట్ర పార్ధి గ్యాంగ్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిసెంబర్ 28: హత్యలు దారి దొపిడిలు, దొంగ తనాలతో దేశంలోని పలు ప్రాంతాల ప్రజలను పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసుల అరెస్టు చేశారు. ఒంటరిగా వెళ్తున్న మహిళ హత్య చేసి వారి వద్ద ఉన్న నగలు నగదును దొచుకునే కరుడుగట్టిన అంతర్ రాష్ట్ర పార్ధి గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ముగ్గురు నిందితులను ఎస్‌ఓటీ, సీసీఎస్ పోలీసులు అరెస్టు చేయగా మరో ఏడుగురు పరారీలో ఉన్నట్టు సైబరాబాద్ సిపి తెలిపారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కమిషనర్ సందీప్ శాండిల్య పార్ధి గ్యాంగ్‌కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహారాష్టల్రోని అమరావలి జిల్లా అంజన్ గావ్‌కు చేందిన ఇస్రామ్ అలీయాస్ రాజేష్ ఖాన్నా (50) కార్తీక్ శివ సింధి (25) పళ్లు గొవింద అర్జున్ బన్స్‌ల్ (21)లను పోలీసులు అరెస్టు చేశారు.
మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని సీపీ వివరించారు. జూన్‌లో కేశారం గేటువద్ద ఆటో దిగి నడుచుకుంటు వెళ్తున్న మహిలను హత్య చేసి అమె మెడలో ఉన్న బంగారు ఆభరణాలను దొచుకుని అనంతరం హత్య చేసి మృతదేహని తగలబెట్టి మట్టిలో పూడ్చి వేశారని చెప్పారు. అక్టోబర్‌లో శంకర్‌పల్లిలో వృద్ధురాలను హత్య చేసి వెండి కడియాలు తీసుకుని అనంతర హత్య చేసిన కేసులు ఇస్రామ్, కార్తీక్‌లు ఉన్నారని తెలిపారు. రెండు హత్య కేసులతో పాటు 8ఇంటి తాళాలు పగల గొట్టి దొంగతనానకు పాల్పడిన కేసులతో పాటు రెండు దొపిడి కేసులలో వీరు నిందితులని తెలిపారు. మహారాష్టల్రోని పర్బని, ముకేడ్, అంజన్‌గావ్, అమరవతిలో సుమారు 80మంది గల పలు దొంగల ముఠాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. నిందితులు ఉంటున్న స్థావరాలను గుర్తించామని నూతన సంవత్సరంలో అక్కడ పోలీసుల సహకారంతో అరెస్టు చేయనున్నట్లు సందీప్ తెలిపారు. పార్ధి గ్యాంగ్ సభ్యులు పాసింజేర్ రైళ్లలో చిన్న గ్రామలకు చేరుకుని మాకాం వేస్తారని రెండు మూడు రోజులు దొంగనాలు చేసుకుని తిరిగి రైళ్లలో వెళ్లి పోతారని చెప్పారు.
ఒంటరిగా వెళ్లె మహిళలను లక్ష్యం చేసుకుని దొంగతనాలకు పాల్పడతారని అనంతరం హత్య చేస్తారని సీపీ వివరించారు. 80మంది ముఠా సభ్యులు వేరువేరు ప్రాంతాలకు వెళ్లి గతనాలకు చేస్తారని తెలిపారు. జల్సాల కోసం చీల్లర దొంగతనాలు, హత్యలు చేయడం దొచుకున్న సోత్తుతో ఎంజాయ్ చేయమే వీరి పని అన్నారు. తెలంగాణలో హుజూరాబాద్, కరీంనగర్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాలో కేసులు వారెంట్లు ఉన్నట్లు సీపీ వెల్లడించారు. ఈముఠాలో షకీల్, బియాజ్, అంబారీజ్, రెడ్డియా, అంబు, బిస్కట్, ఎంకలు పరారీలో ఉన్నట్లు సీపీ చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు ఎస్‌ఓటీ, సీసీఎస్ పోలీసులు చాల శ్రామించారని సిబ్బందిని అభినందించారు. వీరి వద్ద నుండి 12తులాల బంగారు ఆభరణాలు 65తులాల వెండి ఆభరణాలు 1800 రూపాయలు నగదు రెండు సెల్ ఫోన్లు, కత్తులు ఐరన్ రాడ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో జాయింట్ సీపీ షానవాజ్ ఖాసీం, క్రైం డీసీపీ జానకీ షర్మిల, శంషాబాద్ డీసీపీ పద్మజా రెడ్డి, ఏడీసీపీలు ఉదయ భాస్కర్‌రెడ్డి, జగ్నథరెడ్డిలతోపాటు ఏసీపీలు సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం..పార్ధి గ్యాంగ్ వివరాలను వెల్లడిస్తున్న సీపీ ఇతర అధికారులు